ఉరకలేస్తున్న కాళేశ్వరం జలాలు.. లోయర్ మానేర్ గేట్లు ఎత్తివేత
దిశ, వేములవాడ : ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని గోదావరి నది పరుగులు పెడుతోంది. దీంతో అధికారులు కాళేశ్వరం ఎత్తిపోతలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే నీటిని లిఫ్టింగ్ చేయడంతో బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామం వద్ద గల రాజరాజేశ్వర జలాశయం నిండుకోవడంతో దిగువన కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ డ్యాంకు శనివారం అధికారులు వదిలారు. అయితే, కాళేశ్వరం జలాలను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్‌హౌజ్ నుండి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి 9,450 క్యూసెక్కుల నీటిని ముందుగా […]
దిశ, వేములవాడ : ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని గోదావరి నది పరుగులు పెడుతోంది. దీంతో అధికారులు కాళేశ్వరం ఎత్తిపోతలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే నీటిని లిఫ్టింగ్ చేయడంతో బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామం వద్ద గల రాజరాజేశ్వర జలాశయం నిండుకోవడంతో దిగువన కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ డ్యాంకు శనివారం అధికారులు వదిలారు. అయితే, కాళేశ్వరం జలాలను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్‌హౌజ్ నుండి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి 9,450 క్యూసెక్కుల నీటిని ముందుగా లిఫ్టింగ్ చేశారు.
ఆ తర్వాత రాజ రాజేశ్వర జలాశయం నుంచి 9,450 క్యూసెక్కుల నీటిని దిగువన గల లోయర్ మానేర్ డ్యాంకు విడుదల చేస్తున్నట్లు జలాశయం ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. జలాశయంలోని 7 గేట్ల ద్వారా (7, 8, 9,10, 11, 12, 13, 14, 15, 16,17 ) గేట్ల ద్వారా నీటిని వదిలినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో10.483 టిఎంసీల నీరు నిలువ ఉందని 20 టీఎంసీల సామర్ధ్యం వచ్చేవరకు శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు తెలిపారు.