‘ఇళ్ల పట్టాల్లో అంతా అవినీతి’
దిశ, అమరావతి: వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే ఇళ్ల పట్టాల పంపిణీలో రైలు పట్టాలంత అవినీతి జరుగుతోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఇళ్ల పట్టాలు ఉచితం అని మాట్లాడిన వైసీపీ నేతలు నేడు ముడుపులు కచ్చితం అంటున్నారని మండి పడ్డారు. పేదల దగ్గర భూములు లాక్కుని వైసీపీ కార్యకర్తలకు పంచుతారా? అని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పేరుతొ పెద్ద […]
దిశ, అమరావతి: వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే ఇళ్ల పట్టాల పంపిణీలో రైలు పట్టాలంత అవినీతి జరుగుతోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఇళ్ల పట్టాలు ఉచితం అని మాట్లాడిన వైసీపీ నేతలు నేడు ముడుపులు కచ్చితం అంటున్నారని మండి పడ్డారు. పేదల దగ్గర భూములు లాక్కుని వైసీపీ కార్యకర్తలకు పంచుతారా? అని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పేరుతొ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వానికి భూములిచ్చిన రైతుల నుంచి రూ.1,400 కోట్లు కమీషన్ కొట్టేశారని విమర్శించారు. ఇళ్ల స్థలాలు ఇస్తామని మరో రూ.200 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూముల అమ్మకాలు, కొనుగోళ్లుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.