5G టెక్నాలజీతో చాలా ప్రమాదం.. హైకోర్టును ఆశ్రయించిన నటి

దిశ, సినిమా : ఇండియాలో 5జి వైర్‌లెస్ నెట్‌వర్క్ టెక్నాలజీ అమలును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది నటి జూహీ చావ్లా. మనుషులు, జంతుజాలం, వృక్షజాలంపై రేడియేషన్ ప్రభావం వల్ల కలిగే సమస్యలను లేవనెత్తిన ఆమె.. 5జీ టెక్నాలజీ భూమిపై ఉన్న అన్ని జీవులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్స్‌పోజర్‌గా మారుతుందని తెలిపింది. ఇది ప్రస్తుత స్థాయి కంటే 100 రెట్లు అధికంగా ఉంటుందని, మానవులు కోలుకోలేని పరిస్థితులకు దారితీస్తుందని పిటిషన్‌లో పేర్కొంది. తాను టెక్నాలజీ డెవలప్‌మెంట్‌కు వ్యతిరేకం […]

Update: 2021-05-31 07:25 GMT

దిశ, సినిమా : ఇండియాలో 5జి వైర్‌లెస్ నెట్‌వర్క్ టెక్నాలజీ అమలును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది నటి జూహీ చావ్లా. మనుషులు, జంతుజాలం, వృక్షజాలంపై రేడియేషన్ ప్రభావం వల్ల కలిగే సమస్యలను లేవనెత్తిన ఆమె.. 5జీ టెక్నాలజీ భూమిపై ఉన్న అన్ని జీవులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్స్‌పోజర్‌గా మారుతుందని తెలిపింది. ఇది ప్రస్తుత స్థాయి కంటే 100 రెట్లు అధికంగా ఉంటుందని, మానవులు కోలుకోలేని పరిస్థితులకు దారితీస్తుందని పిటిషన్‌లో పేర్కొంది. తాను టెక్నాలజీ డెవలప్‌మెంట్‌కు వ్యతిరేకం కాదని.. కానీ రేడియేషన్ వల్ల ప్రజల ఆరోగ్యం, భద్రతకు ముప్పు ఏర్పడుతుందని నమ్మడానికి తగిన కారణాలున్నాయని చెప్పింది.

ప్రముఖ న్యాయవాది దీపక్ ఖోస్లా ద్వారా నటి పిటిషన్ దాఖలు చేయగా.. 5జీ టెక్నాలజీ అమల్లోకి వస్తే మొక్కలు, జంతువుల్లో డీఎన్‌ఎ, సెల్స్, ఆర్గాన్ సిస్టమ్‌ డ్యామేజ్ అవుతుందని క్లినికల్ అండ్ ఎక్స్‌పరిమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని తెలిపారు. వైర్‌లెస్ మొబైల్ ఫోన్ టెక్నాలజీ ద్వారా ఏర్పడే విద్యుదయస్కాంత కాలుష్యం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం లాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నారు. ఈ కేసు కోర్టులో విచారణకు రాగా జస్టిస్ సి హరి శంకర్.. జూన్ 2కు వాయిదా వేస్తూ మరో బెంచ్‌కు బదిలీ చేశారు.

 

Tags:    

Similar News