షారుఖ్‌ను అర్థరాత్రి ఇంటికి రమ్మన్న యంగ్ హీరోయిన్..

దిశ, సినిమా : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టైమ్ పంక్చువాలిటీ గురించి ఎంతోమంది సెలబ్రిటీలు చాలా సార్లు చెప్పారు. ఉదయం తొమ్మిది గంటలకు రమ్మంటే మధ్యాహ్నం రెండు గంటలకు సెట్‌కు చేరుకుంటాడని ఫరా ఖాన్ కామెంట్స్ చేసింది కూడా. అయితే కొత్తగా షారుఖ్ కోస్టార్, ఫ్రెండ్ జూహీ చావ్లా తనకు జరిగిన ఇన్సిడెంట్ గురించి షేర్ చేసింది. తమ ఇంట్లో పార్టీ జరిగితే షారుఖ్‌ను తప్పకుండా ఇన్వైట్ చేస్తామని.. ఈ క్రమంలో ఓ రోజు […]

Update: 2021-09-24 08:10 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టైమ్ పంక్చువాలిటీ గురించి ఎంతోమంది సెలబ్రిటీలు చాలా సార్లు చెప్పారు. ఉదయం తొమ్మిది గంటలకు రమ్మంటే మధ్యాహ్నం రెండు గంటలకు సెట్‌కు చేరుకుంటాడని ఫరా ఖాన్ కామెంట్స్ చేసింది కూడా. అయితే కొత్తగా షారుఖ్ కోస్టార్, ఫ్రెండ్ జూహీ చావ్లా తనకు జరిగిన ఇన్సిడెంట్ గురించి షేర్ చేసింది. తమ ఇంట్లో పార్టీ జరిగితే షారుఖ్‌ను తప్పకుండా ఇన్వైట్ చేస్తామని.. ఈ క్రమంలో ఓ రోజు పార్టీకి రాత్రి 11గంటలకు అటెండ్ కావాలని సూచించామని తెలిపింది.

షారుఖ్ వస్తున్నాడనే వార్త వినగానే స్టాఫ్‌ తనతో పిక్స్ తీసుకునేందుకు ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూశారని, అయితే షారుఖ్‌కు రిమైండ్ చేసేందుకు ఫోన్ చేస్తే లైట్‌గా లేట్ అవుతుందని చెప్పి, ఉదయం 2:30 గంటలకు వచ్చాడని తెలిపింది. అప్పటికీ ఫుడ్ అయిపోవడం, స్టాఫ్ తమ తమ ఇళ్లకు వెళ్లిపోవడం, తను నిద్రపోవడం అన్నీ జరిగిపోయాయని జూహీ చావ్లా వివరించింది.

Tags:    

Similar News