పరిషత్ ఎన్నికలపై తీర్పు రిజర్వ్
దిశ, వెబ్‌డెస్క్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై జనసేన వేసిన పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలను చేయాలని ప్రభుత్వం, ఎస్‌ఈసీని ఆదేశించింది. జనసేన పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇక అనుబంధ పిటిషన్లపై తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం.. ఎల్లుండి తీర్పు వెలువరించనుంది. ఇవాళ జనసేన పిటిషన్‌పై కోర్టులో విచారణ జరగ్గా.. ఎస్‌ఈసీ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత అందులో జోక్యం చేసుకునే అవకాశం కోర్టుకు […]
దిశ, వెబ్‌డెస్క్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై జనసేన వేసిన పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలను చేయాలని ప్రభుత్వం, ఎస్‌ఈసీని ఆదేశించింది. జనసేన పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇక అనుబంధ పిటిషన్లపై తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం.. ఎల్లుండి తీర్పు వెలువరించనుంది.
ఇవాళ జనసేన పిటిషన్‌పై కోర్టులో విచారణ జరగ్గా.. ఎస్‌ఈసీ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత అందులో జోక్యం చేసుకునే అవకాశం కోర్టుకు లేదని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదించారు. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని బీజేపీ, జనసేన హైకోర్టులో పిటిషన్ వేశాయి.