చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకున్న కీలక పేసర్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్‌కు మరో వారం రోజులే గడువు ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజల్‌వుడ్ షాకిచ్చాడు. కుటుంబ సభ్యులతో గడపడానికి ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు యాజమాన్యానికి కబురు పంపాడు. గత కొన్ని వారాలుగా బయోబబుల్‌లో ఉన్నానని.. ఇప్పుడు మరోసారి అలాంటి వాతావరణంలో గడపలేనని అతడు చెప్పాడు. ‘ఇప్పటికే చాలా వారాలు బయోబబుల్, క్వారంటైన్‌లో గడిపాను. త్వరలో వెస్టిండీస్ పర్యటన, బంగ్లాదేశ్ సిరీస్, యాషెస్, టీ20 వరల్డ్ […]
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్‌కు మరో వారం రోజులే గడువు ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజల్‌వుడ్ షాకిచ్చాడు. కుటుంబ సభ్యులతో గడపడానికి ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు యాజమాన్యానికి కబురు పంపాడు. గత కొన్ని వారాలుగా బయోబబుల్‌లో ఉన్నానని.. ఇప్పుడు మరోసారి అలాంటి వాతావరణంలో గడపలేనని అతడు చెప్పాడు. ‘ఇప్పటికే చాలా వారాలు బయోబబుల్, క్వారంటైన్‌లో గడిపాను. త్వరలో వెస్టిండీస్ పర్యటన, బంగ్లాదేశ్ సిరీస్, యాషెస్, టీ20 వరల్డ్ కప్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్ ఆడితే పూర్తిగా అలసిపోతాను. కాబట్టి ఈ మెగా లీగ్ నుంచి తప్పుకొని కుటుంబంతో గడపాలని భావిస్తున్నాను. మానసికంగా, శారీరికంగా రాబోయే సిరీస్‌లకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాను’ అని హాజెల్‌వుడ్ వెల్లడించాడు. తాజా నిర్ణయంతో సీఎస్కే యాజమాన్యం అతడి స్థానంలో వేరే క్రికెటర్‌ను వెతికే పనిలో పడింది. కేవలం వారం రోజులే గడువు ఉన్న సమయంలో ప్రధాన పేసర్ దూరం కావడం సీఎస్కేకు పెద్ద ఎదురు దెబ్బే.