బిగ్ బాష్‌లో హైదరాబాద్ ప్లేయర్

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జానీ బెయిర్‌స్టో బిగ్‌బాష్ లీగ్‌ (BBL)లోకి అడుగుపెట్టనున్నాడు. ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఐపీఎల్‌లోనే కాకుండా బీబీఎల్‌లో కూడా డిమాండ్ పెరిగింది. బెయిర్‌స్టోను మెల్‌బోర్న్ స్టార్స్ (Melbourne Stars) జట్టు కొనుగోలు చేసినట్లు డైలీ మెయిల్ పత్రిక ఒక కథనాన్ని వెల్లడించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి వైదొలగిన జేసన్ రాయ్.. పెర్త్ స్కార్చర్స్ (Perth Scorchers) జట్టులో చేరబోతున్నాడు. […]

Update: 2020-09-21 09:35 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జానీ బెయిర్‌స్టో బిగ్‌బాష్ లీగ్‌ (BBL)లోకి అడుగుపెట్టనున్నాడు. ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఐపీఎల్‌లోనే కాకుండా బీబీఎల్‌లో కూడా డిమాండ్ పెరిగింది. బెయిర్‌స్టోను మెల్‌బోర్న్ స్టార్స్ (Melbourne Stars) జట్టు కొనుగోలు చేసినట్లు డైలీ మెయిల్ పత్రిక ఒక కథనాన్ని వెల్లడించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి వైదొలగిన జేసన్ రాయ్.. పెర్త్ స్కార్చర్స్ (Perth Scorchers) జట్టులో చేరబోతున్నాడు. జో డెన్లీని మె‌ల్‌బోర్న్ రెనిగేడ్స్ (Melbourne Renegades) జట్టు తీసుకున్నది. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నెంబర్ వన్ బ్యాట్స్‌మాన్‌గా ఉన్న డేవిడ్ మలన్ హోబర్ట్ హరికేన్స్ (Hobart Hurricanes) జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. లియామ్ లివింగ్ స్టోన్, టామ్ బాంటన్‌లు తిరిగి బిగ్ బాష్ లోనికి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News