టీజీటీ ఉపాధ్యాయురాలు మృతి.. గురుకుల జాయింట్ సెక్రటరీ షాకింగ్ డెసిషన్
దిశ, అన్నపురెడ్డిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని గురువారం రాత్రి పాఠశాల (కళాశాల) ప్రాంగణంలోని క్వార్టర్స్‌లో టీజీటీ ఉపాధ్యాయురాలు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై గురుకుల జాయింట్ సెక్రెటరీ కె.శారద శుక్రవారం పాఠశాల (కళాశాల)ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర గురుకుల సెక్రటరీ ఆదేశాల మేరకు కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ రఫీఉద్దీన్, తెలుగు ఉపాధ్యాయుడు మన్మధరావు, ఆర్మీ డ్రిల్ల్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. నిందితులను వెంటనే […]
దిశ, అన్నపురెడ్డిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని గురువారం రాత్రి పాఠశాల (కళాశాల) ప్రాంగణంలోని క్వార్టర్స్‌లో టీజీటీ ఉపాధ్యాయురాలు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై గురుకుల జాయింట్ సెక్రెటరీ కె.శారద శుక్రవారం పాఠశాల (కళాశాల)ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర గురుకుల సెక్రటరీ ఆదేశాల మేరకు కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ రఫీఉద్దీన్, తెలుగు ఉపాధ్యాయుడు మన్మధరావు, ఆర్మీ డ్రిల్ల్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. బాధిత కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తానని జిల్లా కలెక్టర్ అనుదీప్ హామీ ఇచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఆర్ సీ ఓ ప్రత్యూష, ఏఆర్ సీ ఓ పాషా తరులు పాల్గొన్నారు.