హ్యాట్రిక్ ఎమ్మెల్సీలు ఓ వైపు.. ఆశావాహులు మరోవైపు

దిశ ప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆశావాహులు తెరమీదికి వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు తమవంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్సీలతో పాటు మరి కొంతమంది నాయకులు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థిస్తున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్సీలు జిల్లా నుండి మండలికి ప్రాతినిథ్యం వహిస్తోన్న వారిలో నారదాసు లక్ష్మణ్ రావు, […]

Update: 2021-11-10 08:24 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆశావాహులు తెరమీదికి వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు తమవంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్సీలతో పాటు మరి కొంతమంది నాయకులు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థిస్తున్నారు.

హ్యాట్రిక్ ఎమ్మెల్సీలు

జిల్లా నుండి మండలికి ప్రాతినిథ్యం వహిస్తోన్న వారిలో నారదాసు లక్ష్మణ్ రావు, భానుప్రసాదరావుల పదవీకాలం ముగిసింది. వీరు వరుసగా మూడుసార్లు మండలిలో అడుగుపెట్టారు. 2008 నుండి నారదాసు, 2009 నుండి భానుప్రసాదరావులు శాసనమండలికి ఎన్నికయ్యారు. అయితే వీరిద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే మరోసారి అవకాశం దక్కనుందని సమాచారం. బీసీ కార్డుతో పాటు, ఉద్యమ ప్రస్థానం, అధినేత కేసీఆర్ కుటుంబానికి సన్నిహితునిగా ఉన్న నారదాసు వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోకపోవడంతో అటు ప్రస్తుత ఎమ్మెల్సీల్లో, ఇటు ఆశావాహుల్లో ఉత్కంఠ మొదలైంది.

ఆశావాహుల జాబితా ఇది

ఇకపోతే ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న వారి సంఖ్య కూడా జిల్లాలో తీవ్రంగానే ఉంది. ఉమ్మడి జిల్లా నుండే మరో ఐదుగురు నాయకులు పోటీ పడుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. కరీంనగర్ మజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, ఎల్ రమణ, నల్ల మనోహర్ రెడ్డిలు ఆశిస్తున్నారు. కొత్తగా తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని గతంలో కోరుతోన్న వారితో పాటు హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డి, ఎల్ రమణకు ప్రాధాన్యత కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రానున్న ఎన్నికల దృష్ట్యా హుజురాబాద్‌లో బలమైన నేతను తయారు చేయాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కౌశిక్ రెడ్డికి ఖచ్చితంగా అవకాశం ఇస్తారన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన ఎల్ రమణకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవశ్యకత కూడా ఉందని అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో సామాజిక వర్గాల సమీకరణాలు, ఖాళీగా ఉన్న స్థానాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ నిర్ణయానికి రానున్నారు.

తెరమీదికి రాని సంతోష్

కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికై స్వరాష్ట్ర ఆవిర్భావం తరువాత టీఆర్ఎస్‌లో చేరిన టి.సంతోష్ కుమార్ పేరు తెరపైకి రావడం లేదు. ఆయనకు పార్టీ ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తుందోనన్న విషయంపై స్పష్టత లేకుండా ఉంది.

టీఆర్ఎస్ ధర్నాలపై సందిగ్ధం.. కేసీఆర్ మల్లగుల్లాలు

Tags:    

Similar News