అందులో అందరికీ సౌకర్యాలు కల్పిస్తాం..
దిశ, హుస్నాబాద్: నూతనంగా నిర్మిస్తున్న మర్కుక్ పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ క్వార్టర్స్, తదితర భవనాల నిర్మాణ పనులను సోమవారం పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ పరిశీలించారు. అంతేగాకుండా వీటికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించి, కాంట్రాక్టర్ ప్రసాద్ రావుతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్మాణానికి ఉపయోగించే వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలని గ్రిల్స్, డోర్స్, విండోస్, టైల్స్ వర్క్ త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవనాలు నిర్మించడం జరుగుతుందని, అధికారులకు సిబ్బందికి […]
దిశ, హుస్నాబాద్: నూతనంగా నిర్మిస్తున్న మర్కుక్ పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ క్వార్టర్స్, తదితర భవనాల నిర్మాణ పనులను సోమవారం పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ పరిశీలించారు. అంతేగాకుండా వీటికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించి, కాంట్రాక్టర్ ప్రసాద్ రావుతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్మాణానికి ఉపయోగించే వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలని గ్రిల్స్, డోర్స్, విండోస్, టైల్స్ వర్క్ త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవనాలు నిర్మించడం జరుగుతుందని, అధికారులకు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. మర్కుక్ నూతన పోలీస్ స్టేషన్ మర్కుక్ మండలం, శివారు వెంకటాపూర్ గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 602, ఎకరాలు 8.35 గంటల స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రూ.14 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.