ముందంజలో జో బిడెన్..!

లాస్ ఏంజిల్స్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి పోరులో బెర్నీ శాండర్స్ కన్నా.. జో బిడెన్ ముందుకు సాగారు. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక జులైలో పూర్తవుతుంది. కాలిఫోర్నియా లాంటి 14 పెద్ద రాష్ట్రాలు.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు నిన్న ఓటేసిన సంగతి తెలిసిందే. ఇందులో తొలుత బెర్నీ శాండర్స్ లీడ్‌లో […]

Update: 2020-03-04 00:00 GMT

లాస్ ఏంజిల్స్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి పోరులో బెర్నీ శాండర్స్ కన్నా.. జో బిడెన్ ముందుకు సాగారు. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక జులైలో పూర్తవుతుంది. కాలిఫోర్నియా లాంటి 14 పెద్ద రాష్ట్రాలు.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు నిన్న ఓటేసిన సంగతి తెలిసిందే. ఇందులో తొలుత బెర్నీ శాండర్స్ లీడ్‌లో ఉన్నా.. తర్వాత జో బిడెన్ దూసుకెళ్లారు. మూడు రాష్ట్రాలు బెర్నీ శాండర్స్‌కు మద్దతుగా నిలవగా.. ఏడు రాష్ట్రాలు జో బిడెన్‌ను సమర్థించినట్టు తెలిసింది. అందుకే ఈ రోజు నిజంగా గుడ్ నైటే అని జో బిడెన్ వ్యాఖ్యానించారు. సూపర్ ట్యూస్‌డేను ఊరికే అలా పిలవలేదు. నిజంగా ఈ రోజు మరింత ఆకర్షణీయంగా ఉందని అన్నారు.

Tags: joe biden, bernie sanders, presidential nomination race, US elections, super tuesday

Tags:    

Similar News