కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్: నటి డైమండ్ ఆభరణాలు చోరీ
దిశ, సినిమా: బ్రిటిష్ యాక్టర్ – మోడల్ జోడీ టర్నర్ స్మిత్‌కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అనుకోని సంఘటన ఎదురైంది. శుక్రవారం బ్రేక్ ఫాస్ట్‌కు అటెండ్ అయిన సమయంలో తన రూమ్‌లోకి ఎంటరైన దొంగలు విలువైన డైమండ్ ఆభరణాలు, తల్లి వెడ్డింగ్ రింగ్‌ను దొంగతనం చేశారు. దీంతో క్రోయిసెట్‌లోని మారియట్ హోటల్‌లో స్టే చేసిన ఆమె.. చోరీ తర్వాత వెంటనే మాజెస్టిక్ హోటల్‌కు షిఫ్ట్ అయింది. వన్ ఇయర్ బేబీతో ఫిల్మ్ ఫెస్టివల్‌కు అటెండ్ అయిన జోడీ […]
దిశ, సినిమా: బ్రిటిష్ యాక్టర్ – మోడల్ జోడీ టర్నర్ స్మిత్‌కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అనుకోని సంఘటన ఎదురైంది. శుక్రవారం బ్రేక్ ఫాస్ట్‌కు అటెండ్ అయిన సమయంలో తన రూమ్‌లోకి ఎంటరైన దొంగలు విలువైన డైమండ్ ఆభరణాలు, తల్లి వెడ్డింగ్ రింగ్‌ను దొంగతనం చేశారు. దీంతో క్రోయిసెట్‌లోని మారియట్ హోటల్‌లో స్టే చేసిన ఆమె.. చోరీ తర్వాత వెంటనే మాజెస్టిక్ హోటల్‌కు షిఫ్ట్ అయింది. వన్ ఇయర్ బేబీతో ఫిల్మ్ ఫెస్టివల్‌కు అటెండ్ అయిన జోడీ టర్నర్.. బిడ్డ భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.
didn’t think i would be spending 2.5 hours in the police station on my final day in cannes, but here we are… 🥴
— Jodie (@MissJodie) July 11, 2021
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తొలిసారి హాజరైన జోడీ.. గురువారం గోల్డ్ అండ్ డైమండ్ జువెల్లరీస్ ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రసారం అయ్యాక దొంగలు తనను టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన తర్వాత కూడా జోడీ కేన్స్‌లో తన ప్రదర్శనలు కంటిన్యూ చేయడం విశేషం. ఈ క్రమంలో ఆదివారం చానల్స్‌కు స్పెషల్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చిన జోడీ.. ఆ తర్వాత ట్విట్టర్‌లో తన బాధను వ్యక్తం చేసింది. కేన్స్ ఫైనల్ డే.. దాదాపు రెండున్నర గంటలు పోలీస్ స్టేషన్‌లో స్పెండ్ చేస్తానని అనుకోలేదని ట్వీట్ చేసింది.