పరీక్ష లేకుండా ఎస్‌బీఐ‌ బ్యాంకులో ఉద్యోగమంట

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా అన్ని రంగాల ప్రజలు అల్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే నిరుద్యోగుల పరిస్థితి అయితే దారుణంగా మారింది. ఈ సమయంలో ఎస్‌బీఐ‌ ఓ తియ్యటి వార్తను తెలియజేసింది. 444 స్పెషలిస్టు ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. తమ వెబ్ సైట్ లో లాగిన్ అయి దరఖాస్తు చేయొచ్చని, దరఖాస్తు […]

Update: 2020-06-24 22:05 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా అన్ని రంగాల ప్రజలు అల్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే నిరుద్యోగుల పరిస్థితి అయితే దారుణంగా మారింది. ఈ సమయంలో ఎస్‌బీఐ‌ ఓ తియ్యటి వార్తను తెలియజేసింది. 444 స్పెషలిస్టు ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. తమ వెబ్ సైట్ లో లాగిన్ అయి దరఖాస్తు చేయొచ్చని, దరఖాస్తు చేసే అభ్యర్థులు రెజ్యుమ్, గుర్తింపు, వయసు ధృవీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్ లోడ్ చేయాలని సూచించింది. కానీ, అభ్యర్థులు ఎలాంటి పరీక్షలు రాయనవసరంలేదు. అయితే అప్లై చేసిన అభ్యర్థులను ఎస్‌బీఐ‌ షార్ట్ లిస్ట్ చేయనున్నది. అనంతరం వారికి ఇంటర్వ్యూ నిర్వహించనున్నది. అందులో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయించనున్నది. ఏ ఇద్దరికైనా కటాఫ్ మార్కులు సమానంగా వస్తే వయసు ఆధారంగా ఎంపిక చేయనున్నది.

Tags:    

Similar News