వినాయక చవితి బంపర్ ఆఫర్.. రూ. 500లకే ‘JIO’ స్మార్ట్‌ఫోన్.!
దిశ, వెబ్‌డెస్క్ : కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే వారికి గుడ్ న్యూస్. వినాయక చవితి సందర్బంగా(సెప్టెంబరు 10న) జియో-గూగుల్ భాగస్వామ్యంలో రానున్న స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ (JioPhone Next)ను రిలయన్స్ సంస్థ విడుదల చేయనుంది. అయితే, ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలో ఈ ఫోన్ మార్కెట్‌లోని రానున్నట్టు సమాచారం. వినూత్న ఆఫర్లతో ఈ ఫోన్ విడుదల కానున్నట్టు అనేక వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి నెట్‌లో అనేక […]
దిశ, వెబ్‌డెస్క్ : కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే వారికి గుడ్ న్యూస్. వినాయక చవితి సందర్బంగా(సెప్టెంబరు 10న) జియో-గూగుల్ భాగస్వామ్యంలో రానున్న స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ (JioPhone Next)ను రిలయన్స్ సంస్థ విడుదల చేయనుంది.
అయితే, ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలో ఈ ఫోన్ మార్కెట్‌లోని రానున్నట్టు సమాచారం. వినూత్న ఆఫర్లతో ఈ ఫోన్ విడుదల కానున్నట్టు అనేక వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి నెట్‌లో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, రిలయన్స్ జియో మాత్రం అందరికీ అందుబాటులో ఉండేలా.. ధర విషయంలో సరికొత్త వ్యూహాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. వివరాల మేరకు రెండు మోడళ్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక మోడల్ ధర రూ.5,000.. మరొకటి రూ.7,000 అని నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది.
అయితే, వీలైనంత ఎక్కువ మందికి ఈ ఫోన్లను చేర్చేందుకు జియో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం ధరలో కేవలం 10 శాతం అంటే.. ఒక మోడల్‌కు రూ.500, మరో మోడల్‌కు రూ.700 చెల్లిస్తే ఫోన్‌ను సొంతం చేసుకునేలా ఓ ప్రత్యేక పథకాన్ని రూపొందించినట్లు సమాచారం. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు, లేదా ఆర్థిక సంస్థలకు ఇన్‌స్టాల్మెంట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఇటీవలే జియోఫోన్ నెక్ట్స్ ధర రూ.3,499గా ఉండే అవకాశం ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇటు జియో గానీ, అటు గూగుల్ గానీ ఫోన్ ధర, ఫీచర్లపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.