జియోలో టీకాల సమాచారం
దిశ, ఫీచర్స్: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ కొనసాగుతోంది. టీకా తీసుకోవడం వల్ల కొవిడ్‌ను నిరోధించడంతో పాటు ప్రాణభయం ఉండదని వైద్య నిపుణులు సూచిస్తుండటంతో అందరూ టీకా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే టీకా ‘స్లాట్’ బుక్ చేసుకోవడం యుద్ధానికి తక్కువేం కాదు అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ తమ జియో యూజర్లకు వ్యాక్సిన్స్ అవలేబిలిటీ ఇన్‌ఫర్మేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో కేర్ వాట్సాప్ పోర్టల్‌లో ప్రతిరోజూ కొన్ని మోతాదులు అవలేబుల్‌లో […]
దిశ, ఫీచర్స్: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ కొనసాగుతోంది. టీకా తీసుకోవడం వల్ల కొవిడ్‌ను నిరోధించడంతో పాటు ప్రాణభయం ఉండదని వైద్య నిపుణులు సూచిస్తుండటంతో అందరూ టీకా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే టీకా ‘స్లాట్’ బుక్ చేసుకోవడం యుద్ధానికి తక్కువేం కాదు అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ తమ జియో యూజర్లకు వ్యాక్సిన్స్ అవలేబిలిటీ ఇన్‌ఫర్మేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో కేర్ వాట్సాప్ పోర్టల్‌లో ప్రతిరోజూ కొన్ని మోతాదులు అవలేబుల్‌లో ఉండనుండగా, వాటిని సెకన్ల వ్యవధిలో బుక్ చేసుకోవచ్చు.
రిలయన్స్ జియో, వాట్సాప్‌లు జట్టుగా ఏర్పడి టీకా లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని దాని వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా అందిస్తున్నాయి. ఇందుకోసం యూజర్లు జియో కేర్ నెంబర్ 7000770007ను వాట్సాప్‌లో సేవ్ చేసుకుని ‘హాయ్’ అని మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సెకన్ల వ్యవధిలోనే బోట్.. ‘సిరీస్ ఆఫ్ ఆప్షన్స్’తో కూడిన మెనూ సదరు యూజర్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. అందులో ‘వ్యాక్సిన్ ఇన్ఫో’ ట్యాబ్‌పై క్లిక్ చేయగానే.. వ్యాక్సిన్ సెంటర్స్, టీకా సమాచారం అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో టీకా కేంద్రం గురించి అడగ్గానే, సమీపంలోని టీకా కేంద్రాల కోసం ఆరు అంకెల ఏరియా పిన్ కోడ్‌ను నమోదు చేయమని అడుగుతుంది. ఎంటర్ చేయగానే, అందుబాటులోని జాబితాను సెకన్ల వ్యవధిలో సెండ్ చేస్తుంది. జాబితా చివరలో టీకా అపాయింట్‌మెంట్ చేసుకునేందుకు కొవిన్ యాప్ లింక్‌ను పంచుకుంటుంది.
కొవిన్ యాప్‌లో వ్యాక్సిన్ లభ్యతను చెక్ చేయాలంటే ప్రతీసారి లాగిన్ కావాల్సిందే. కానీ ఇందులో ఆ అవసరం లేకుండానే నేరుగా టీకాల లభ్యతను చెక్ చేయవచ్చు. అంతేకాదు ఈ చాట్‌బోట్.. రిలయన్స్ జియో నంబర్లపైనే కాకుండా ఇతర నెట్‌వర్క్ నెంబర్లతోనూ పనిచేస్తుంది. అంతేకాదు జియో యూజర్లు.. ఇకపై ఫోన్ రీచార్జ్‌లు, చెల్లింపులు, మొబైల్ పోర్టబిలిటీ, ఇంటర్నేషనల్ రోమింగ్, జియోమార్ట్ వంటి సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చని రిలయన్స్ పేర్కొంది.