సినీ పరిశ్రమ రుణం తీర్చుకుంటున్న మెగాస్టార్ : జేడీ చక్రవర్తి
దిశ, వెబ్ డెస్క్: విలన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి, హీరోగా ఎదిగి, డైరక్టర్ గా సెటిలైన నటుడు జేడీ చక్రవర్తి. కరోనా వల్ల దేశం మొత్తం లాక్డౌన్ కొనసాగుతోంది. నిత్య అవసరాలు, మెడిసిన్ లకు సంబంధించిన పరిశ్రమలు తప్పించి మిగతా అన్ని పరిశ్రమలపై కరోనా ప్రభావం పడింది. అందులో సినీ పరిశ్రమ కూడా ఒకటి. వేలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి .. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి […]
దిశ, వెబ్ డెస్క్: విలన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి, హీరోగా ఎదిగి, డైరక్టర్ గా సెటిలైన నటుడు జేడీ చక్రవర్తి. కరోనా వల్ల దేశం మొత్తం లాక్డౌన్ కొనసాగుతోంది. నిత్య అవసరాలు, మెడిసిన్ లకు సంబంధించిన పరిశ్రమలు తప్పించి మిగతా అన్ని పరిశ్రమలపై కరోనా ప్రభావం పడింది. అందులో సినీ పరిశ్రమ కూడా ఒకటి. వేలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి .. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటి’ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు రూ.8కోట్ల రూపాయల విరాళాన్ని సేకరించి కార్మికులందరికీ నిత్యావసర వస్తువులు, మందులు , ఇతర సామాగ్రి ని అందించారు. అవసరమున్న వారికి అందిస్తూనే ఉన్నారు. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జేడీ చక్రవర్తి ఓ లేఖ రాశారు. ట్విట్టర్ లో షేర్ చేసిన ఆ లేఖలో ఏముందంటే..
‘‘ప్రియమైన చిరంజీవిగారు..నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. మిమ్మల్ని ఒక నటుడిగా ఇష్టపడేవాడిని.. అంతకు మించి కాదు. నా తోటి నటులందరూ సాయంత్ర వేళల్లో .. మీతో కలిసి స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపేవారు… నేనెప్పుడూ అలా చేయలేదు, చేయాలనుకోలేదు. ఇది నేను మీకు రాస్తున్న ఓపెన్ లెటర్. కరోనా అడుగుపెట్టడం దురదృష్టం. దాని వల్ల ప్రపంచమంతా ఆగిపోయింది. సినిమా పరిశ్రమ కూడా ఎప్పుడూ లేనంతగా నష్టపోయింది. ప్రస్తుతం సినిమా ఇంతకు ముందెన్నడూ లేనంత ఇబ్బందులను ఎదుర్కొంటుంది. మాటల్లో చెప్పలేనంతగా సినీ కార్మికులు నష్టపోయారు. నాతో పాటు మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారు. కానీ మీరు ఈ ఆపత్కాలంలో.. చేతలతో ముందుకు వచ్చారు. ఇది ఇన్ క్రెడిబుల్. మిమ్మల్ని అభిమానులే కాదు.. అందరూ ఎందుకు అంతగా ఇష్టపడతారో, నమ్ముతారో మీరు ఇప్పుడు చేస్తున్న పనే నిదర్శనం. మీరు మెగాస్టార్ కాదు మీరు మెగాస్టార్ కంటే కూడా.. ఓ గొప్ప వ్యక్తిగా అభివర్ణించాలి. సినీ కార్మికులు నాకు ఫోన్ చేసినప్పుడు తమ కుటుంబాలకు ఎలాంటి ఆకలి సమస్యలు లేవని, చిరంజీవిగారు కావాల్సినంత నిత్యావసర వస్తువులను అందజేశారని తెలిపారు. మీరు ఇండస్ట్రీ రుణం తీర్చుకుంటున్నానని అంటున్నారు కానీ కార్మికుల పట్ల అది మీకున్న గౌరవంగా భావిస్తున్నాను. మీ హృదయం కరెక్ట్ ప్లేస్ లో ఉంది. చాలా మందికి హృదయం ఉంటుంది. కానీ అది రైట్ ప్లేస్ లో ఉండదని అందులో నేను కూడా ఒకడిని . ఇప్పుడు మెగాస్టార్ ని మరింత అభిమానిస్తున్నాను. హోలీ హ్యుమన్ మై చిరు…ఎప్పటికీ మీ అభిమానిని, అనుచరుడిని. నటుడిగా కాకుండా మిమ్మల్ని అమితంగా ఇష్టపడుతున్నాను. ప్రేమిస్తున్నాను. లాక్ డౌన్ లేకపోతే .. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడ్ని. బిట్టర్ హ్యుమన్ బీయింగ్ నుంచి… బెటర్ హ్యుమన్ గా ఎలా మారాలో మీ దగ్గర నేర్చుకోవాలి..’’ అని తన లేఖలో పేర్కొన్నారు జేడీ చక్రవర్తి.
tags: jd chakravarthy, megastar chiranjeevi, ccc, cine employees, labours