జనసేన నుంచి అందుకే బయటకి వచ్చాను: లక్ష్మీ నారాయణ

2019 ఎన్నికల ఫలితాల అనంతరం సీబీఐ మాజీ జేడీ, విశాఖపట్టణం జనసేన ఎంపీ అభ్యర్ధి వీవీ లక్ష్మీ నారాయణ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ అధినేతకు బహిరంగ లేఖరాసి బయటకు వచ్చిన ఆయన పార్టీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందన్న దానిపై వివరణ ఇవ్వలేదు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో జనసేన నుంచి బయటకు రావడంపై వివరణ ఇచ్చారు. అందులో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని, తప్పుడు నిర్ణయం తీసుకున్నానని […]

Update: 2020-05-04 06:14 GMT

2019 ఎన్నికల ఫలితాల అనంతరం సీబీఐ మాజీ జేడీ, విశాఖపట్టణం జనసేన ఎంపీ అభ్యర్ధి వీవీ లక్ష్మీ నారాయణ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ అధినేతకు బహిరంగ లేఖరాసి బయటకు వచ్చిన ఆయన పార్టీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందన్న దానిపై వివరణ ఇవ్వలేదు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో జనసేన నుంచి బయటకు రావడంపై వివరణ ఇచ్చారు.

అందులో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని, తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కానీ తానెప్పుడూ భావించలేదని అన్నారు. తాను ఆది నుంచీ రాజకీయాల్లోకి రావాలని అనుకునే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే రాజకీయాల్లోకి రాలేదని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేయగానే ప్రజల్లోకి వెళ్లానని అన్నారు. అలా ప్రజా సమస్యల గురించి తెలుసుకున్న తరువాత రాజకీయాల్లోకి వచ్చానని ఆయన గుర్తు చేశారు.

ప్రజా ప్రతినిధిగా పదవిలో ఉంటే వారి సమస్యలు తీర్చవచ్చని భావించానని, అందుకే తాను ప్రజల్లోకి వెళ్లానన్నారు. జనసేన నుంచి బయటకు వచ్చిన తరువాత రకరకాల విశ్లేషణలు తాను కూడా వింటున్నానని అన్నారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీలో చేరుతానంటూ ఎక్కువ మంది భావిస్తున్నారని చెప్పారు. తనకు ఎక్కడున్నానన్నది ముఖ్యం కాదని, ఎక్కడున్నా మార్పు కోసం ప్రయత్నించాలన్నదే తన ధ్యేయమని ఆయన చెప్పారు.

ప్రజల జీవన విధానాలను మార్చే క్రమంలో ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలని భావిస్తే భవిష్యత్తులో తాను ఆ దిశగా అడుగులు వేస్తానని ఆయన చెప్పారు. జనసేనలో సమష్టిగా పని చేద్దామని చేరానని అన్నారు. అంతేకాకుండా ఫుల్‌టైమ్ రాజకీయాల్లో పని చేయాలన్న లక్ష్యంతోనే జనసేనలో చేరానని ఆయన స్పష్టం చేశారు. అయితే జనసేనలో ఫుల్‌టైమ్ రాజకీయాలు లేవని ఆయన పేర్కొన్నారు. అందుకే తాను జనసేన నుంచి బయటకు వచ్చానని వీవీ లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు.

tags: janasena, ap, politics, cbi ex-jd, vv laxminarayana

Tags:    

Similar News