కరోనా భయంతో మిడిమిడి జ్ఞానం వద్దు: జేపీ

కరోనా భయంతో మిడిమిడి జ్ఞానంతో మందులు వాడవద్దని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రజలను హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఇప్పటివరకు చేసిన కరోనా టెస్టులు చాలా తక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కరోనా టెస్టులు విరివిగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ లాక్ డౌన్ ను మరికొన్నిరోజుల పాటు పొడిగించాలని ఆయన సూచించారు. ప్రధానంగా వలసకూలీలను వారి వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేయాలని రెండు […]

Update: 2020-03-29 00:20 GMT

కరోనా భయంతో మిడిమిడి జ్ఞానంతో మందులు వాడవద్దని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రజలను హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఇప్పటివరకు చేసిన కరోనా టెస్టులు చాలా తక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కరోనా టెస్టులు విరివిగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ లాక్ డౌన్ ను మరికొన్నిరోజుల పాటు పొడిగించాలని ఆయన సూచించారు.

ప్రధానంగా వలసకూలీలను వారి వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేయాలని రెండు తెలుగు రాష్టాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా అపోహలు ఉన్నాయన్న ఆయన, అధిక ఉష్ణోగ్రతల వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందనేది అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు. కరోనా నివారణ పేరిట మిడిమిడి జ్ఞానంతో క్లోరోక్విన్ మాత్రలు వేసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అని ఆయన హెచ్చరించారు. కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని హితవు పలికారు.

Tags: jayaprakash narayana, loksatta, hyderabad, telugu states, corona

Tags:    

Similar News