ఆవు, ఎద్దును కలిపిన డిప్యూటీ సీఎం కుమారుడు

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ మూలంగా మానవ జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా దీని ప్రభావం పలు రంగాలపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్ కారణంగా మార్కెట్లు లేక, పంటలు అమ్ముకునే మార్గం లేక రైతులు విలవిల్లాడుతున్నారు. తమిళనాడులోని ఓ రైతు కూడా కరోనా ప్రభావంతో ఆర్థికంగా కుంగిపోయాడు. దాంతో తన వద్ద ఉన్న ఆవును మరో ఊరికి చెందిన వ్యక్తికి అమ్మేశాడు. […]

Update: 2020-07-14 10:20 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ మూలంగా మానవ జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా దీని ప్రభావం పలు రంగాలపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్ కారణంగా మార్కెట్లు లేక, పంటలు అమ్ముకునే మార్గం లేక రైతులు విలవిల్లాడుతున్నారు. తమిళనాడులోని ఓ రైతు కూడా కరోనా ప్రభావంతో ఆర్థికంగా కుంగిపోయాడు. దాంతో తన వద్ద ఉన్న ఆవును మరో ఊరికి చెందిన వ్యక్తికి అమ్మేశాడు. ఆ ఆవును వాహనంలో తరలిస్తుండగా, అక్కడే స్థానికంగా ఓ ఆలయంలో ఉండే ఎద్దు పరుగుపరుగున వచ్చింది.

ఆ వాహనం చుట్టూ తిరుగుతూ ముందుకు కదలకుండా చేసేందుకు ప్రయత్నించింది. ఆ ఎద్దు అలా చేయడానికి బలమైన కారణమే ఉంది. రైతుకు చెందిన ఆ ఆవు, ఆలయం వద్ద ఉండే ఎద్దు మధ్య మంచి చెలిమి ఏర్పడింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఆవును తన నుంచి దూరం చేస్తుండడంతో భరించలేని ఆ ఎద్దు గంటసేపు హంగామా సృష్టించింది. ఎలాగోలా ఆ వాహనం బయల్దేరడంతో ఎద్దు దాని వెంబడే పరుగులు తీసింది. అయితే ఈ వీడియో తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం చిన్నకుమారుడు జయప్రదీప్ కంటపడింది.

ఆవు పట్ల ఎద్దు చూపిస్తున్న ప్రేమ జయప్రదీప్‌ను కదిలించింది. దాంతో ఆ ఆవును కొనుగోలు చేసి సదరు గ్రామంలోని ఆలయ కమిటీకి అప్పగించాడు. దాంతో ఆవు, ఎద్దు మళ్లీ ఒక్కటయ్యాయి. జయప్రదీప్ చొరవను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. మూగజీవాల పట్ల ఆయన స్పందనను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News