ప్రెషర్ బాంబు పేలి జవాన్‌కు గాయాలు
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మందుపాతర పేలిన ఘటనలో ఓ జవాన్ గాయపడ్డారు. సోన్‌పూర్ రోడ్డు మార్గం కుందల సమీపంలో రహదారి పక్కన కూంబింగ్ పోలీసుల లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబును గమనించక ఓ జవాన్ దాన్ని తొక్కడంతో అది పేలినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలకు వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన […]
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మందుపాతర పేలిన ఘటనలో ఓ జవాన్ గాయపడ్డారు. సోన్‌పూర్ రోడ్డు మార్గం కుందల సమీపంలో రహదారి పక్కన కూంబింగ్ పోలీసుల లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబును గమనించక ఓ జవాన్ దాన్ని తొక్కడంతో అది పేలినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలకు వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన జవాన్‌ని హుటాహుటిన చికిత్స నిమిత్తం జిల్లా అసుపత్రికి తరలించారు. ఈ ఘటనని ఏఎస్‌పీ నీరజ్ చంద్రకర్ ధృవీకరించారు.