పోలీసుల వింత తీర్పు.. భార్య, ప్రేయసితో చెరో మూడ్రోజుల కాపురం.. ఒక రోజు సెలవు!

దిశ, వెబ్‌డెస్క్ : పోలీసులు.. పౌరులకు, కోర్టులకు మధ్య అప్పుడప్పుడు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తుంటారు. సొసైటీలో రోజువారీగా చోటుచేసుకునే నేరాల్లో మాత్రం వారు తమ డ్యూటీని యథావిధిగా చేసుకుంటూ పోతారు. అయితే, చుట్టుపక్కల జరిగే చిన్నచితకా గొడవలు, చిరు దొంగతనాలు, కుటుంబ సమస్యలు, ప్రేమ పంచాయితీలు స్టేషన్ గడప తొక్కినప్పుడు పెద్దమనుషులుగా వ్యవహరించి తీర్పులు కూడా చెబుతుంటారు. దేశంలో చాలా కేసులు కోర్టుల్లో కుప్పలు తెప్పలుగా పెరుకుపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాజాగా ఓ కేసు విషయంలో […]

Update: 2021-02-17 09:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పోలీసులు.. పౌరులకు, కోర్టులకు మధ్య అప్పుడప్పుడు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తుంటారు. సొసైటీలో రోజువారీగా చోటుచేసుకునే నేరాల్లో మాత్రం వారు తమ డ్యూటీని యథావిధిగా చేసుకుంటూ పోతారు. అయితే, చుట్టుపక్కల జరిగే చిన్నచితకా గొడవలు, చిరు దొంగతనాలు, కుటుంబ సమస్యలు, ప్రేమ పంచాయితీలు స్టేషన్ గడప తొక్కినప్పుడు పెద్దమనుషులుగా వ్యవహరించి తీర్పులు కూడా చెబుతుంటారు. దేశంలో చాలా కేసులు కోర్టుల్లో కుప్పలు తెప్పలుగా పెరుకుపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాజాగా ఓ కేసు విషయంలో జార్ఖండ్ పోలీసులు ఇచ్చిన తీర్పు సర్వత్రా చర్చనీయాంశం కావడంతో పాటు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇదివరకే పెళ్లైన ఓ వ్యక్తి అబద్ధాలు చెప్పి మరో అమ్మాయితో ప్రేమాయణం నడిపించాడు. అది కాస్త ఇంట్లో తెలిసేసరికి ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. దీంతో ఇరు బాధిత కుటుంబాలు అతనిపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. ఈ కేసు విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వారంలో మూడ్రోజులు భార్యతో, మరో మూడ్రోజులు ప్రేయసితో కలిసి ఉండాలని తీర్పునిచ్చారు. ఇక్కడ మరో విశేషం ఎంటంటే అతనికి ఒకరోజు హాలిడే కూడా ప్రకటించారు. ఈ తీర్పుపై ఇరు కుటుంబాలు ఎలా స్పందించాయో తెలియాలంటే రీడ్ దీస్ స్టోరీ..

జార్ఖండ్ రాజధాని రాంచీలోని కోకర్ తిరిల్ రోడ్‌లో ‘రాజేష్ మహాటో’ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి ఇదివరకే వివాహం కాగా, కూతురు కూడా ఉంది. అయినప్పటికీ తాను ఒంటరినని చెప్పి మరో యువతితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఆ తర్వాత భార్య, బిడ్డను వదిలేసి ప్రేయసితో పరారయ్యాడు. విషయం తెలిసి భార్య తరఫు బంధువులు కేసు పెట్టగా.. అమ్మాయి కుటుంబీకులు కూడా అతనిపై కిడ్నాప్ కేసు పెట్టారు. అప్పటికే రాజేశ్ తన ప్రేయసిని పెళ్లిచేసుకున్నాడు. తీరా పోలీస్‌స్టేషన్‌‌కు వచ్చాక భార్య, ప్రియురాలు ఇద్దరూ గొడవకు దిగారు. ఇరువురిని శాంతింపజేసిన పోలీసులు.. ఓ వింత పరిష్కారం చూపించారు.

వారంలో మూడ్రోజులు భార్యతో, మరో మూడ్రోజులు ప్రియురాలితో ఉండాలని.. ఒక్క రోజు సెలవు తీసుకోవాలని తీర్పు చెప్పారు. దీనిపై తొలుత అభ్యంతరం వ్యక్తం చేసినా చివరకు ఇరువురు ఓ అంగీకారానికి వచ్చారు. అనంతరం రెండు పార్టీలు అధికారికంగా ఒక ‘అగ్రిమెంట్’పై సంతకం చేయగా.. దానికి సంబంధించిన కాపీలను కూడా ఇరు కుటుంబాలకు అందజేశారు. అయితే, కొద్దిరోజుల తర్వాత, వివాహం సాకుతో తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ప్రేయసి రాజేష్‌పై ఫిర్యాదు చేసింది. ఈ విషయం కాస్త స్థానిక కోర్టుకు చేరడంతో న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు రాజేష్ పేరు మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కాగా, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News