ముంబై ఎయిర్‌పోర్టులో హీరోయిన్‌ను అడ్డుకున్న అధికారులు 

దిశ, సినిమా : శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు అధికారులు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిన క్రమంలో.. దుబాయ్ వెళ్తున్న తనకు విచారణ పూర్తయ్యే వరకు ఇండియాను విడిచి వెళ్లేది లేదని సూచించారు. దీంతో రిటర్న్ అయిన జాక్వెలిన్ ముంబైలోని తన నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా మనీ లాండరింగ్ కేసు విచారణ సందర్భంలో సుఖేశ్ చంద్రశేఖర్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పింది భామ. […]

Update: 2021-12-05 09:26 GMT

దిశ, సినిమా : శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు అధికారులు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిన క్రమంలో.. దుబాయ్ వెళ్తున్న తనకు విచారణ పూర్తయ్యే వరకు ఇండియాను విడిచి వెళ్లేది లేదని సూచించారు.

దీంతో రిటర్న్ అయిన జాక్వెలిన్ ముంబైలోని తన నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా మనీ లాండరింగ్ కేసు విచారణ సందర్భంలో సుఖేశ్ చంద్రశేఖర్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పింది భామ. కానీ తాజాగా తనతో క్లోజ్‌నెస్ ఫొటోలు బయటకు రావడంతో విచారణ మొదలుపెట్టిన ఈడీ అధికారులు… జాక్వెలిన్ సుఖేష్ నుంచి దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులు అందుకున్నట్లు తెలిపారు. మరోవైపు నోరా ఫతేహీ కూడా కారును కానుకగా పొందినట్లు సమాచారం.

Tags:    

Similar News