అందరికీ శార్వారీ నామ సంవత్సర శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

అందరికీ శార్వారీ నామ సంవత్సర శుభాకాంక్షలు అంటూ తెలుగు ప్రజలందరికీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాదిని పురస్కరించుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సోదర, సోదరీమణులందరికీ శార్వరీ నామ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పిన కల్యాణ్… కరోనా మహమ్మారి కారణంగా యావత్ప్రపంచ వణికిపోతున్న తరుణంలో శార్వరీ నామ ఉగాది వస్తోందన్నారు. విపత్కర పరిస్థితుల్లో అందరికీ మేలు జరగాలని, సంపూర్ణ ఆయుష్షును కలిగి ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఉగాది వేడుకలను ఇంటి వరకే […]

Update: 2020-03-25 01:10 GMT

అందరికీ శార్వారీ నామ సంవత్సర శుభాకాంక్షలు అంటూ తెలుగు ప్రజలందరికీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాదిని పురస్కరించుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సోదర, సోదరీమణులందరికీ శార్వరీ నామ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పిన కల్యాణ్… కరోనా మహమ్మారి కారణంగా యావత్ప్రపంచ వణికిపోతున్న తరుణంలో శార్వరీ నామ ఉగాది వస్తోందన్నారు. విపత్కర పరిస్థితుల్లో అందరికీ మేలు జరగాలని, సంపూర్ణ ఆయుష్షును కలిగి ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఉగాది వేడుకలను ఇంటి వరకే పరిమితం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే పండుగ జరుపుకుందామని పవన్ సూచించారు. కరోనా ముప్పు తొలగిననాడే నిజమైన ఉగాదని ఆయన పేర్కొన్నారు.

Tags: pawan kalyan, ugadi, janasena, ap

Tags:    

Similar News