AP KGBV Recruitment:నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త..కేజీబీవీ స్కూళ్లలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్

ఆంధ్రప్రదేశ్(AP)లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో టీచర్‌ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Update: 2024-09-27 21:02 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్(AP)లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో టీచర్‌ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 604 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.2024-25 సంవత్సరానికి కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది.ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 26 నుంచి ప్రారంభం కాగా, అక్టోబర్‌ 10 తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్‌ లో చూడవచ్చు. 


Similar News