ఏపీ గ్రామ సచివాలయాల్లో ఇక నుంచి ఆ సేవలు బంద్‌

ఏపీ గ్రామ సచివాలయాల్లో ఒక నుంచి రిజిస్ట్రేషన్లు బంద్‌ కానున్నాయి...

Update: 2024-09-27 17:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ గ్రామ సచివాలయాల్లో(AP Village Secretariats) ఇక నుంచి రిజిస్ట్రేషన్లు(Registrations) బంద్‌ కానున్నాయి. గత ప్రభుత్వం(Previous Govt) గ్రామ సచివాలయల వ్యవస్థను తీసుకొచ్చింది. ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల బాధ్యతలను కూడా సచివాలయాలకే అప్పగించింది. అయితే ఈ ప్రక్రియలో చాలా అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టాలన్న గత సర్కార్‌ ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ సిసోడియా(Revenue Department Special CS Sisodia) జీవో జారీ చేశారు. ఈ జీవో జారీతో ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరగనుంది. 


Similar News