GITAM University: గీతం యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్ధిని ఆత్మహత్య

బీటెక్(B.Tech)​ చదువుతున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-09-28 00:14 GMT

దిశ, వెబ్‌డెస్క్:బీటెక్(B.Tech)​ చదువుతున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఏపీ(AP)కి చెందిన వర్ష(19) అనే యువతి రుద్రారం గ్రామంలోని గీతం విశ్వవిద్యాలయం(GITAM University)లో బీటెక్​ సీఎస్​ఈ రెండో సంవత్సరం(CSE Second Year) చదువుతోంది.అక్కడే బాలికల వసతి గృహం(Girls Hostel)లో ఉంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలో ఫ్యాన్(Fan)కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.హాస్టల్ లోని తోటి విద్యార్థినులు తన గది తలుపులు కొట్టినా తియ్యకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ వాచ్ మన్(Hostel Watchman) కి సమాచారం అందించారు.వాచ్ మన్ వచ్చి గది తెలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూడగా..ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.కాగా సదరు విద్యార్థిని గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటోందని సహచర విద్యార్థులు చెప్పారు.విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్​చెరు(Patancheru)లోని ప్రభుత్వ ఆసుపత్రి(Govt Hospital)కి తరలించామని పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Similar News