సెమీస్‌లో పాకిస్థాన్ చిత్తు

         అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఎదురు లేకుండా పోయింది. అంచనాలను అందుకుంటూ దూసుకుపోతోంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టును చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత క్రీడాకారులు ధాటిగా బౌలింగ్ చేయడంతో 43.1 ఓవర్లకే ఆలౌట్ అయింది. 172 పరుగులు చేసింది. ఓపెన్ హైదర్ అలీ 56, రోహెల్ నాజీర్ 62 పరుగులు మినహా మిగతా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్స్ ఎవరూ రాణించలేదు. […]

Update: 2020-02-04 09:17 GMT

అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఎదురు లేకుండా పోయింది. అంచనాలను అందుకుంటూ దూసుకుపోతోంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టును చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత క్రీడాకారులు ధాటిగా బౌలింగ్ చేయడంతో 43.1 ఓవర్లకే ఆలౌట్ అయింది. 172 పరుగులు చేసింది. ఓపెన్ హైదర్ అలీ 56, రోహెల్ నాజీర్ 62 పరుగులు మినహా మిగతా పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్స్ ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లు సుశాంత్ మిశ్రా 3, కార్తిక్ త్యాగి, రావి బిష్ణోయి చెరో 2 వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు సునాయసంగా విజయం సాధించింది. ఓపెనర్లు ఆడుతూ పాడుతూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 35.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 113 బంతుల్లో 105 పరుగులు( 8 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు) చేయగా, మరో ఓపెనర్ 99 బంతుల్లో 59 పరుగులు (6 ఫోర్లు) చేశాడు. సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు పాకిస్థాన్‌పై ఇది వరుసగా నాలుగో విజయం.

Tags:    

Similar News