యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం: జైరాం నాయక్

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ నిబంధనలు ఉల్లంఘించిందని ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జైరాం నాయక్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగలేదన్నారు. వెనక తలుపు తెరుచుకోకపోవడంతో ఆలస్యమైందని, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని జైరాం నాయక్ చెప్పారు. కాగా, స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం జరిగిన పలువురు […]

Update: 2020-08-09 01:55 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ నిబంధనలు ఉల్లంఘించిందని ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జైరాం నాయక్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగలేదన్నారు. వెనక తలుపు తెరుచుకోకపోవడంతో ఆలస్యమైందని, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని జైరాం నాయక్ చెప్పారు.

కాగా, స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం జరిగిన పలువురు కరోనా పేషెంట్లు మృతి చెందిన విషయం విధితమే.

Tags:    

Similar News