‘జై భీమ్’పై పొలిటికల్ వార్.. సూర్యకు సపోర్ట్‌గా తమిళ ఇండస్ట్రీ

దిశ, సినిమా : సూర్య లేటెస్ట్ పిక్చర్ ‘జై భీమ్’ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ రియాక్షన్స్ అందుకుంటోంది. అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవస్థాగత అన్యాయాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఈ సినిమాపై విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే పాజిటివిటీ ఉన్నచోటకు నెగెటివిటీ చేరుకోవడం పక్కా. ‘జై భీమ్’ విషయంలో ఇది కాస్త లేటైంది అంతే. ఈ సినిమా వన్నియర్ కమ్యూనిటీ మనోభావాలను కించపరిచిందని ఆ సంఘం నుంచి లీగల్ నోటీసులు పంపించిన ‘పీఎంకే పార్టీ […]

Update: 2021-11-17 04:21 GMT

దిశ, సినిమా : సూర్య లేటెస్ట్ పిక్చర్ ‘జై భీమ్’ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ రియాక్షన్స్ అందుకుంటోంది. అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవస్థాగత అన్యాయాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఈ సినిమాపై విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే పాజిటివిటీ ఉన్నచోటకు నెగెటివిటీ చేరుకోవడం పక్కా. ‘జై భీమ్’ విషయంలో ఇది కాస్త లేటైంది అంతే.

ఈ సినిమా వన్నియర్ కమ్యూనిటీ మనోభావాలను కించపరిచిందని ఆ సంఘం నుంచి లీగల్ నోటీసులు పంపించిన ‘పీఎంకే పార్టీ లీడర్, మాజీ కేంద్ర మంత్రి అన్బుమణి రామదాస్’.. నష్టపరిహారంగా రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే మూవీ పొలిటికల్ డిబేట్‌కు వెళ్లగా.. సినీ ఇండస్ట్రీ సూర్య తరపున ఫైట్‌కు సిద్ధమైంది. డైరెక్టర్ వెట్రిమారన్, లోకేశ్ కనగరాజ్, ప్రకాశ్ రాజ్, సత్యరాజ్, సిద్ధార్థ్‌తో పాటు నడియార్ సంఘం సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

‘బాధితుల కష్టాలను ప్రపంచానికి తెలిపేందుకు దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని రూపొందించడంలో నిబద్ధత చూపించాడు. సామాజిక అన్యాయం పట్ల సూర్య నిరంతర కృషి నిజంగా స్ఫూర్తిదాయకం. అట్టడుగు వర్గాల స్థితి మారకూడదనుకునే వారిలో ఈ సినిమా(#JaiBheem) బెంగ పుట్టించడం సహజం. #WeStand WithSuriya. సమాజంలోని అసమానతలను, అన్యాయాలను ప్రశ్నించే సినిమాలు సామాజిక న్యాయం వైపుగా నడిపించే ఆయుధాలు. మేము#JaiBheem టీమ్‌కు అండగా ఉంటాం’ అని వెట్రిమారన్ అన్నారు.

‘మేం కమల్‌హాసన్‌తో నిలబడ్డాం.. విజయ్‌తో నిలబడ్డాం.. సూర్యతో కలిసి నిలబడతాం. అభిప్రాయ భేదాలు లేదా వ్యక్తిగత శత్రుత్వం కారణంగా ఆర్టిస్టును బెదిరించడం లేదా ఆర్టిస్టిక్ క్రియేషన్‌ను అడ్డుకోవడం పిరికితనం. నేను #JaiBheem మేకర్స్‌కు అండగా ఉంటాను’ అని సిద్ధార్థ్ తన మద్దతు తెలిపాడు.

‘జై భీమ్ అనేది సామాజిక మార్పును ప్రేరేపించే ప్రయత్నాల్లో భాగంగా తీసుకొచ్చిన సినిమా. అలాంటి చిత్రాన్ని నిర్మించిన సూర్యను.. సమాజంలో సానుకూల మార్పుకు వ్యతిరేకంగా లేదా హింసను ప్రోత్సహించే వ్యక్తిగా పేర్కొనడం తప్పు. చిత్రనిర్మాతల కళాత్మక స్వేచ్ఛకు భంగం కలగకుండా కళను నిలబెట్టడం ఉత్తమమైన పని. ఇదే ట్రెండ్ కొనసాగితే, చిత్ర నిర్మాతలు షూటింగ్‌కు ముందు రాజకీయ నాయకుల ఆమోదం కోసం వారి ఇంటి బయట వేచి ఉండాల్సి వస్తుంది’ అని నడియార్ సంఘం పేర్కొంది.

Tags:    

Similar News