పరిహారం ఎంత ఇస్తారు.. ఉపాధి కల్పిస్తారా..?
దిశ, కరీంనగర్: కాళేశ్వరం లింక్ టు పనుల్లో భాగంగా భూ సేకరణ జరిపే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూరులో భూ సేకరణ జరపాల్సిన వివరాలను, కుటుంబ సభ్యుల జాబితాను గ్రామ సభలో చదివి వినిపించేందుకు అధికారులు వచ్చారు. అయితే రైతులు వారిని అడ్డకుని ఇప్పటికే మూడు సార్లు గ్రామంలో సభ నిర్వహించారని వచ్చినప్పుడల్లా జాబితా చదివి వినిపిస్తున్నారే తప్ప పరిహారం ఎంత ఇస్తారు, బాధిత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తారా లేదా అన్న విషయాలను […]
దిశ, కరీంనగర్: కాళేశ్వరం లింక్ టు పనుల్లో భాగంగా భూ సేకరణ జరిపే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూరులో భూ సేకరణ జరపాల్సిన వివరాలను, కుటుంబ సభ్యుల జాబితాను గ్రామ సభలో చదివి వినిపించేందుకు అధికారులు వచ్చారు. అయితే రైతులు వారిని అడ్డకుని ఇప్పటికే మూడు సార్లు గ్రామంలో సభ నిర్వహించారని వచ్చినప్పుడల్లా జాబితా చదివి వినిపిస్తున్నారే తప్ప పరిహారం ఎంత ఇస్తారు, బాధిత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తారా లేదా అన్న విషయాలను మాత్రం వివరించడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అధికారులు మాట్లాడుతూ… తాము తుది జాబితాను తయారు చేసేందుకు మాత్రమే వచ్చామని, ఈ జాబితాలో ఎక్కాల్సిన పేర్లు కాని ఇతరాత్ర వివరాలు కాని తప్పుగా ఉన్నట్టయితే వాటిని సవరించుకోవాలని సూచించేందుకు ఈ సభను ఏర్పాటు చేశామన్నారు. రైతులు మాత్రం తమ భూములు కోల్పోతున్నందున తమకు ఇవ్వాల్సిన సాయం పట్ల స్పష్టత ఇచ్చిన తరువాతే సర్వేలు కానీ సేకరణకు సంబంధించిన పనులు కానీ చేపట్టుకోవాలని స్పష్టం చేశారు.