కత్తి మహేశ్ చికిత్స కోసం జగన్ సర్కార్ భారీ సాయం..

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సినీనటుడు, విమర్శకుడు కత్తి మహేశ్ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కత్తి మహేష్‌ వైద్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల వేసింది. ఈ మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లేఖ విడుదలైంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నగదు అందించారు. ఇటీవల చెన్నై, నెల్లూరు ప్రధాన రహదారిలో కత్తి […]

Update: 2021-07-02 04:49 GMT

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సినీనటుడు, విమర్శకుడు కత్తి మహేశ్ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కత్తి మహేష్‌ వైద్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల వేసింది. ఈ మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లేఖ విడుదలైంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నగదు అందించారు. ఇటీవల చెన్నై, నెల్లూరు ప్రధాన రహదారిలో కత్తి మహేష్ యాక్సిడెంట్‌కు గురైన విషయం తెలిసిందే. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అతడి తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. కత్తి మహేశ్‌ను నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలోకి తరలించారు. అక్కడే వారం రోజులుగా కత్తి మహేష్‌కు చికిత్స జరుగుతుంది. ప్రస్తుతం కత్తి మహేశ్ కోలుకుంటున్నట్లు బంధువులు తెలిపారు.

Tags:    

Similar News