ఏపీలో ప్రతీ నియోజకవర్గానికి ఒక ఐటీఐ కాలేజ్: సీఎం జగన్
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ గుడ్‌న్యూస్ తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ఐటీఐ కళాశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రతీ నియోజకవర్గానికి ఐటీఐ కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫలితంగా నియోజకవర్గ స్థాయిలో తప్పనిసరిగా నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ గుడ్‌న్యూస్ తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ఐటీఐ కళాశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రతీ నియోజకవర్గానికి ఐటీఐ కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫలితంగా నియోజకవర్గ స్థాయిలో తప్పనిసరిగా నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ఒక పారిశ్రామిక శిక్షణా సంస్ధ ఏర్పాటవుతుందని చెప్పుకొచ్చారు.
ప్రైవేటు ఐటీఐల్లో కనీస సదుపాయాలపైనకూడా దృష్టిపెట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల ప్రమాణాలపై సర్టిఫికేషన్ చేయించాలన్న సీఎం.. ప్రతి కళాశాల, ఐటీఐ కూడా నిర్దేశిత ప్రమాణాలను సాధించే దిశగా అడుగులు ముందుకేయాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐల్లో అవసరమైన టీచింగ్ స్టాఫ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో టీచింగ్ సిబ్బందిపై పరిశీలన చేయాలని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.