థర్డ్ వేవ్‌పై జగన్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: థర్డ్ వేవ్‌పై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్ వేవ్ వస్తుందో.. లేదో మనకు తెలియదని, కానీ మనం ప్రిపేర్‌గా ఉండటం అన్నది మన చేతుల్లోని అంశమని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని, నిర్ణయించిన ధరలు కన్నా ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవద్దని సూచించారు. ఎవరైనా ఆధిక ఛార్జీలు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు జగన్ సూచించారు. అధిక ఛార్జీలు వసూలు చేసే హాస్పిటల్స్‌ను మూసివేసేందుకు కలెక్టర్లు […]

Update: 2021-06-16 04:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: థర్డ్ వేవ్‌పై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్ వేవ్ వస్తుందో.. లేదో మనకు తెలియదని, కానీ మనం ప్రిపేర్‌గా ఉండటం అన్నది మన చేతుల్లోని అంశమని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని, నిర్ణయించిన ధరలు కన్నా ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవద్దని సూచించారు. ఎవరైనా ఆధిక ఛార్జీలు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు జగన్ సూచించారు.

అధిక ఛార్జీలు వసూలు చేసే హాస్పిటల్స్‌ను మూసివేసేందుకు కలెక్టర్లు వెనకాడవద్దని, ప్రజలను పీడించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీ వేయాలని, రెండోసారి చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని జగన్ సూచించారు. కరోనాపై ఇవాళ కలెక్టర్లతో జగన్ రివ్యూ సమావేశం నిర్వహించారు. కర్ఫ్యూ మంచి ఫలితాలనిచ్చిందని, కరోనా ఎప్పటికీ జీరో స్థాయికి చేరుతుందని అనుకోవద్దన్నారు. మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలని, ఇవి మన జీవితంలో భాగం కావాలన్నారు.

గ్రామాల్లో ఫీవర్ సర్వే కార్యక్రమాలు ప్రతివారం కొనసాగాలని, టెస్టులు ఇష్టానుసారం కాకుండా లక్షణాలు ఉన్నవారికే చేయాలని జగన్ సూచించారు. పేదవాడిపై ఆర్థికభారం పడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News