నేటి నుంచి జేఈఈ మెయిన్ దరఖాస్తులు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షా తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) మంగళవారం వెల్లడించింది. ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్ నిర్వహిస్తుంటారు. 2021, ఫిబ్రవరి 22 నుంచి 25 మధ్య 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జేఈఈ మెయిన్-2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళ వారం నుంచి ప్రారంభం కానున్నది. వచ్చే ఏడాది జనవరి 15 వరకు అభ్యర్థులు jeemain.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే విద్యా […]
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షా తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) మంగళవారం వెల్లడించింది. ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్ నిర్వహిస్తుంటారు. 2021, ఫిబ్రవరి 22 నుంచి 25 మధ్య 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జేఈఈ మెయిన్-2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళ వారం నుంచి ప్రారంభం కానున్నది. వచ్చే ఏడాది జనవరి 15 వరకు అభ్యర్థులు jeemain.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం కోసం జేఈఈ మెయిన్స్‌ను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పలు దఫాలుగా నిర్వహించనున్నారు.