కోటప్పకొండకు ఐఎస్‌వో గుర్తింపు

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ(ISO)గుర్తింపు లభించింది. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి, ధర్మకర్త కొండలరావు జమిందార్, ఈఓ రామకోటిరెడ్డిలకు గుర్తింపు పత్రాలు అందచేశారు. ఐఎస్ఓ గుర్తింపు రావడంపై ఎమ్మెల్యే గోపిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కొండపై స్వామి వారికి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో కోటప్పకొండ ప్రసాదాలు లడ్డు , అరిసెలకు కూడా అంతర్జాతీయ […]

Update: 2021-08-30 12:13 GMT

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ(ISO)గుర్తింపు లభించింది. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి, ధర్మకర్త కొండలరావు జమిందార్, ఈఓ రామకోటిరెడ్డిలకు గుర్తింపు పత్రాలు అందచేశారు. ఐఎస్ఓ గుర్తింపు రావడంపై ఎమ్మెల్యే గోపిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కొండపై స్వామి వారికి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో కోటప్పకొండ ప్రసాదాలు లడ్డు , అరిసెలకు కూడా అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు.

 

Tags:    

Similar News