ఈటల క్యాంప్‌లో మార్పు… అందుకేనా..?
దిశ, హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన భవిష్యత్ కార్యచరణ కోసం హుజురాబాద్ నియోజకవర్గంలోనే మూడు రోజులు ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈటల పర్యటన హుజురాబాద్‌లో రేపటితో ముగియనున్నట్లు స్థానిక నాయకులు వెల్లడించారు. మంగళవారం మళ్లీ హైదారాబాద్‌కు వచ్చి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారెమోనని నాయకులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. హుజురాబాద్ నియోజకవర్గం నిరసనలతో హీటెక్కింది. ఈటల భర్తరఫ్‌ను నిరసిస్తూ పలు […]
దిశ, హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన భవిష్యత్ కార్యచరణ కోసం హుజురాబాద్ నియోజకవర్గంలోనే మూడు రోజులు ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈటల పర్యటన హుజురాబాద్‌లో రేపటితో ముగియనున్నట్లు స్థానిక నాయకులు వెల్లడించారు. మంగళవారం మళ్లీ హైదారాబాద్‌కు వచ్చి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారెమోనని నాయకులు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. హుజురాబాద్ నియోజకవర్గం నిరసనలతో హీటెక్కింది. ఈటల భర్తరఫ్‌ను నిరసిస్తూ పలు చోట్ల కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అంతేకాకుండా ఈటెల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శామీర్‌పేట నుండి హుజురాబాద్ బయలు దేరిన ఈటలను గజ్వేల్-ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద బిసి సంఘాల నేతలు కలిసి మద్దతు తెలిపారు.