రష్మికనే కావాలంటున్నమాజీ లవర్?
రష్మిక మందనా… కన్నడ సినిమా కిరాక్ పార్టీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఈ ప్రేమ ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. కానీ తర్వాత బ్రేకప్ అయింది. కారణం రష్మికకు ఆఫర్లు వెల్లువెత్తడం. దీంతో రక్షిత్‌కు బైబై చెప్పేసి.. తన కెరియర్‌పై కాన్సంట్రేట్ చేసింది. దీంతో మా హీరోను మోసం చేశావంటూ రక్షిత్ ఫ్యాన్స్ రష్మికపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో చాలా ఇబ్బంది పెట్టారు. ఇన్ని సమస్యల నుంచి బయటకొచ్చిన […]
రష్మిక మందనా… కన్నడ సినిమా కిరాక్ పార్టీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఈ ప్రేమ ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. కానీ తర్వాత బ్రేకప్ అయింది. కారణం రష్మికకు ఆఫర్లు వెల్లువెత్తడం. దీంతో రక్షిత్‌కు బైబై చెప్పేసి.. తన కెరియర్‌పై కాన్సంట్రేట్ చేసింది. దీంతో మా హీరోను మోసం చేశావంటూ రక్షిత్ ఫ్యాన్స్ రష్మికపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో చాలా ఇబ్బంది పెట్టారు. ఇన్ని సమస్యల నుంచి బయటకొచ్చిన రష్మిక.. టాలీవుడ్, శాండల్ వుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి కోలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది.
అయితే కిరాక్ పార్టీ హీరోకి మళ్లీ రష్మిక వైపు మనస్సు మళ్లిందంటూ శాండల్ వుడ్ టాక్. అందుకే కిరాక్ పార్టీ సీక్వెల్‌కు ప్లాన్ చేసి… హీరోయిన్‌గా రష్మికనే ఎంచుకున్నాడట. అంతేకాదు ఈ సినిమాతో డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గాను మారనున్నాడట రక్షిత్. ఈ మధ్యే శ్రీ మన్నారయణ సినిమాతో తెలుగులో ఓ సినిమాను డబ్ చేసిన రక్షిత్.. ఈ సినిమాతో టాలీవుడ్‌లో స్ట్రెయిట్ ఫిల్మ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. మరి రక్షిత్ కోరికను రష్మిక స్వీకరిస్తుందో లేదో చూడాలి మరి.