ఆమెతో కలిసి జపాన్ చెక్కేసిన ఎన్టీఆర్.. కారణం ఏంటో తెలుసా? (వీడియో)
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ఇటీవల ‘దేవర’(Devara: Part 1)సినిమాతో ఘన విజయం సాధించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ఇటీవల ‘దేవర’(Devara: Part 1)సినిమాతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashant Neel) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అయితే ఇందులో కన్నడతో పాటు తెలుగులోనూ మంచి టాక్ అందుకున్న 'సప్త సాగరాలు దాటి' మూవీ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. యాక్షన్ డ్రామాగా రాబోతుండగా.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దీనికి ‘డ్రాగన్’టైటిల్ పెట్టే ప్లాన్‌లో మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ‘వార్-2’ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, తారక్ జపాన్ వెళ్లారు. ‘దేవర’ ప్రమోషన్ కోసం భార్య ప్రణతితో కలిసి వెళ్తుండగా.. ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంట పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 28న జపాన్ థియేటర్స్‌లోకి ‘దేవర’సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇటీవల కల్కి కూడా తెలుగులో విడుదలైన కొన్ని నెలల తర్వాత జపాన్ లో రిలీజ్ అయింది. అలా ఇప్పుడు దేవర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఎన్టీఆర్ స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు.
#YoungTiger ..జపాన్ లో pic.twitter.com/zM0Y53gPj7
— devipriya (@sairaaj44) March 23, 2025