టీ20 లీగ్స్‌కు అందుబాటులో ఉండను: పఠాన్
దిశ, స్పోర్ట్స్: ప్రస్తుత పరిస్థితుల్లో తాను టీ20 లీగ్స్‌కు అందుబాటులో ఉండబోనని, కానీ భవిష్యత్‌లో మాత్రం ఫ్రాంచైజీ బేస్డ్ లీగ్స్ ఆడటానికి సిద్ధమేనని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సోమవారం స్పష్టం చేశాడు. ఆగస్టు 28నుంచి ప్రారంభం కానున్న లంకన్ ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) తొలి సీజన్‌కు జరగనున్న ఆటగాళ్ల వేలంలో విదేశీ క్రీడాకారుల లిస్టులో ఇర్ఫాన్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతడిని తీసుకోవడానికి నాలుగైదు ఫ్రాంచైజీలు ఆసక్తితో ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ ఏడాది […]
దిశ, స్పోర్ట్స్: ప్రస్తుత పరిస్థితుల్లో తాను టీ20 లీగ్స్‌కు అందుబాటులో ఉండబోనని, కానీ భవిష్యత్‌లో మాత్రం ఫ్రాంచైజీ బేస్డ్ లీగ్స్ ఆడటానికి సిద్ధమేనని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సోమవారం స్పష్టం చేశాడు. ఆగస్టు 28నుంచి ప్రారంభం కానున్న లంకన్ ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) తొలి సీజన్‌కు జరగనున్న ఆటగాళ్ల వేలంలో విదేశీ క్రీడాకారుల లిస్టులో ఇర్ఫాన్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతడిని తీసుకోవడానికి నాలుగైదు ఫ్రాంచైజీలు ఆసక్తితో ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పఠాన్ ఈ విషయాన్ని ఖండించాడు. ఇర్ఫాన్ గతంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. భారత్ తరఫున ఇర్ఫాన్ 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.