గతేడాది కంటే బెటర్‌గా ప్రిపేర్ అయ్యాం

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో గతేడాది కంటే ఈ ఏడాది బెటర్‌గా ప్రిపేర్ అయ్యామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ వెల్లడించారు. హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరిచామని తెలిపారు. గతేడాది దాదాపు 80శాతం మంది హోం ఐసొలేషన్‌లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,084 కరోనా కోసం ప్రత్యేక హాస్పిటళ్లు సేవలందిస్తున్నాయని అన్నారు. అలాగే, 12,000 క్వారంటైన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనా కేసులు భారీగా విజృంభిస్తున్నప్పటికీ మరణాల రేటులో పెద్దగా మార్పులేదని, ఇది […]

Update: 2021-04-20 09:30 GMT

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో గతేడాది కంటే ఈ ఏడాది బెటర్‌గా ప్రిపేర్ అయ్యామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ వెల్లడించారు. హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరిచామని తెలిపారు. గతేడాది దాదాపు 80శాతం మంది హోం ఐసొలేషన్‌లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,084 కరోనా కోసం ప్రత్యేక హాస్పిటళ్లు సేవలందిస్తున్నాయని అన్నారు. అలాగే, 12,000 క్వారంటైన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనా కేసులు భారీగా విజృంభిస్తున్నప్పటికీ మరణాల రేటులో పెద్దగా మార్పులేదని, ఇది ఊరటనిచ్చే విషయమని పేర్కొన్నారు.

మరణాలు రేటు 1.18శాతంగా ఉన్నదని, 1.75శాతం పేషెంట్లు ఐసీయూలో ఉన్నారని వివరించారు. 0.40శాతం పేషెంట్లు వెంటిలేటర్ సపోర్టుతో ఉండగా, 4.03శాతం మందికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం పడుతున్నదని పేర్కొన్నారు. పెద్ద పెద్ద హాస్పిటళ్లు అదనపు బెడ్‌లను ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలని కోరారు. గడిచిన మూడు నాలుగు రోజుల్లో 800 నాన్ ఐసీయూ ఆక్సిజన్ బెడ్లను పెద్ద సంస్థల్లో జోడించామని తెలిపారు. డీఆర్‌డీవో, సీఎస్ఐఆర్‌లు ఢిల్లీ హాస్పిటళ్లలో అదనంగా పడకల వసతిని కల్పించాయని వివరించారు. సఫ్దార్‌జంగ్, లేడీ హర్దింగే హాస్పిటళ్లలో కొత్త బెడ్‌లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఎయిమ్స్‌లోనూ బెడ్‌ల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు.

Tags:    

Similar News