పుల్లూరు టోల్ గేట్ వద్ద ఇరాన్ దేశస్తులు

దిశ, మహబూబ్‎నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ సరిహద్దు ప్రాంతమైన జోగులంబా గద్వాల్ జిల్లా పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద ఇరాన్ దేశానికి చెందిన నలుగురిని పోలీసులు అడ్డుకున్నారు.  వారు మహమ్మద్ ఖాన్, అక్తర్ మస్తజ, అబ్బాస్ అలీలియ, సింజత కోహికర్లుగా పోలీసులు గుర్తించారు. కాగా,  ఎటువంటి అనుమతి లేకుండా ఎలా రాష్ట్రంలోకి వస్తారని అక్కడే నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ చేస్తుంటే ఇరాన్‎కు చెందిన నలుగురు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఎలా […]

Update: 2020-03-27 09:36 GMT

దిశ, మహబూబ్‎నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ సరిహద్దు ప్రాంతమైన జోగులంబా గద్వాల్ జిల్లా పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద ఇరాన్ దేశానికి చెందిన నలుగురిని పోలీసులు అడ్డుకున్నారు. వారు మహమ్మద్ ఖాన్, అక్తర్ మస్తజ, అబ్బాస్ అలీలియ, సింజత కోహికర్లుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఎటువంటి అనుమతి లేకుండా ఎలా రాష్ట్రంలోకి వస్తారని అక్కడే నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ చేస్తుంటే ఇరాన్‎కు చెందిన నలుగురు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఎలా తిరుగుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మూడు నెలల కిందట ఇండియాకు వచ్చినట్లు ఇరాన్ దేశస్తులు తెలిపారు. కోల్ కతా, చెన్నై నుంచి వస్తున్నామని మమ్ములను ఎవరు అడ్డుకోలేదని.. తెలంగాణ రాష్ట్రంలో కి అనుమతిస్తే మా దేశానికి వెళ్ళిపోతామని వాగ్వివాదానికి దిగారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చేంతవరకు ఎక్కడికి వెళ్లేందుకు వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇరాన్ వాసులు దేశంలో సంచరించడం అక్కడి అధికారులను కలవరపెట్టింది.

tag: Iranians, Pullur Toll gate, under police, Jogulamba Gadwal

Tags:    

Similar News