'భారత ఆటగాళ్లతో ఐపీఎల్ నిర్వహించండి'

నిన్న, మొన్నటి వరకు కరోనా తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. అకస్మాత్తుగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో లాక్‌డౌన్‌పై కేంద్రం పునరాలోచనలో పడింది. కాగా, ఇప్పటికే కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, అప్పటికి కూడా లీగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. కాగా, బీసీసీఐ మాత్రం ఐపీఎల్ రద్దు ప్రకటనపై వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రంజిత్ కీలక […]

Update: 2020-04-02 02:51 GMT

నిన్న, మొన్నటి వరకు కరోనా తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. అకస్మాత్తుగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో లాక్‌డౌన్‌పై కేంద్రం పునరాలోచనలో పడింది. కాగా, ఇప్పటికే కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, అప్పటికి కూడా లీగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. కాగా, బీసీసీఐ మాత్రం ఐపీఎల్ రద్దు ప్రకటనపై వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రంజిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇది ఎలాగో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాబట్టి విదేశీయులు లేకుండానే పూర్తిగా భారతీయ క్రికెటర్లతో ఐపీఎల్ నిర్వహించాలని’ కోరారు. మన వాళ్లకే ఆటను పరిమితం చేసి.. ఐపీఎల్ నిడివిని కూడా కుదించి ఆడించాలన్నారు. గతంలో అంటే భారతీయ క్రికెటర్లు పెద్దగా అందుబాటులో లేరు.. కానీ ఇప్పుడు ఎంతో మంది నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకొచ్చారని, వీళ్లు విదేశీయులకు ధీటుగా ఆడే సామర్థ్యం కలిగి ఉన్నారని రంజిత్ చెప్పారు. ఏప్రిల్ 15 తర్వాత బీసీసీఐ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని రంజిత్ సూచించారు.

Tags: IPL, BCCI, Indian cricketers, Rajasthan Royals

Tags:    

Similar News