ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం ఈ-ఆక్షన్.. బీసీసీఐకి వేల కోట్ల ఆదాయం..!
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో కొత్త జట్ల కోసం టెండర్లను పూర్తి చేసిన బీసీసీఐ ఇక మీడియా రైట్స్ కోసం కసరత్తు ప్రారంభించింది. కొత్త జట్ల ద్వారా రూ. 12,715 కోట్లు ఖజానాలోకి చేరబోతున్నాయి. ప్రస్తుతం స్టార్ ఇండియా వద్ద ఐపీఎల్ మీడియా హక్కులు ఉన్నాయి. 2022 సీజన్‌తో దీని గడువు ముగియనున్నది. దీంతో 2023 నుంచి 2027 వరకు ఐదేళ్ల కాలపరిమితికి మీడియా హక్కులు అమ్మకానికి పెట్టనున్నది. మీడియా హక్కులను ఈ-అక్షన్ ద్వారా అమ్మాలని బీసీసీఐ భావిస్తున్నట్లు […]
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో కొత్త జట్ల కోసం టెండర్లను పూర్తి చేసిన బీసీసీఐ ఇక మీడియా రైట్స్ కోసం కసరత్తు ప్రారంభించింది. కొత్త జట్ల ద్వారా రూ. 12,715 కోట్లు ఖజానాలోకి చేరబోతున్నాయి. ప్రస్తుతం స్టార్ ఇండియా వద్ద ఐపీఎల్ మీడియా హక్కులు ఉన్నాయి. 2022 సీజన్‌తో దీని గడువు ముగియనున్నది. దీంతో 2023 నుంచి 2027 వరకు ఐదేళ్ల కాలపరిమితికి మీడియా హక్కులు అమ్మకానికి పెట్టనున్నది. మీడియా హక్కులను ఈ-అక్షన్ ద్వారా అమ్మాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. 2018లో స్వదేశీ మ్యాచ్‌ల హక్కులను ఈ-ఆక్షన్ వేయడం వల్ల భారీ డిమాండ్ ఏర్పడింది. ఐపీఎల్ హక్కులు కూడా ఇలాగే అమ్మేయాలని బీసీసీఐ భావిస్తున్నది. గత ఐదేళ్లకు గాను అప్పట్లో స్టార్ ఇండియా రూ. 16,347.50 కోట్లకు హక్కులు అమ్మింది. రాబోయే ఐదేళ్లకు గాను బీసీసీఐ రూ. 37000 కోట్ల నుంచి 40000 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్నది. ఈ సారి స్టార్ ఇండియాతో పాటు, జీ-సోనీ గ్రూప్, రిలయన్స్‌కు చెందిన నెట్‌వర్క్ 18 పోటీలో ఉండబోతున్నట్లు సమాచారం.