ఐపీఎల్ జరగకపోతే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం : బట్లర్

కరోనా ఎఫెక్ట్ క్రీడారంగంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇప్పటికే స్థానిక క్రీడల నుంచి అంతర్జాతీయ పోటీల వరకు అన్ని రకాల ఈవెంట్లు రద్దయ్యాయి లేదా వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక దఫా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఈ నెల 15వ తేదీ నుంచైనా జరుగుతుందనే నమ్మకం లేదు. కాగా, కరోనా కారణంగా ఐపీఎల్ జరగకపోతే ‘అది సిగ్గు చేటు’ అని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఇంగ్లాండ్ ‘క్రికెటర్ జాస్ బట్లర్’ […]

Update: 2020-04-08 02:57 GMT

కరోనా ఎఫెక్ట్ క్రీడారంగంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇప్పటికే స్థానిక క్రీడల నుంచి అంతర్జాతీయ పోటీల వరకు అన్ని రకాల ఈవెంట్లు రద్దయ్యాయి లేదా వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక దఫా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఈ నెల 15వ తేదీ నుంచైనా జరుగుతుందనే నమ్మకం లేదు. కాగా, కరోనా కారణంగా ఐపీఎల్ జరగకపోతే ‘అది సిగ్గు చేటు’ అని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఇంగ్లాండ్ ‘క్రికెటర్ జాస్ బట్లర్’ అభిప్రాయపడ్డాడు. ‘ఐపీఎల్ జరుగుతుందా లేదా అన్న విషయంపై నాకు పెద్దగా అవగాహన లేదు. చాలా మంది ఈ టోర్నీని కరోనా ప్రభావం తగ్గిన తర్వాత నిర్వహించాలని చెబుతున్నారు. ప్రస్తుతమైతే పరిస్థితి గందరగోళంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఏం జరుగుతుందో ముందే చెప్పలేం’ అన్నాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జాస్ బట్లర్ గత సీజన్లలో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. లీగ్ జరగకపోవడం వల్ల ఆటగాళ్లకే కాకుండా, బీసీసీఐకి కూడా నష్టమేనని.. భారీగా రెవెన్యూ కోల్పోవలసి వస్తుందని బట్లర్ అంటున్నాడు. ఐపీఎల్ ఏంటో మంది యువ క్రికెటర్లకు అవకాశాలను కల్పిస్తోందని అన్నాడు. అందుకే ఐపీఎల్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసైనా నిర్వహించాలని బట్లర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Tags: IPL, England, Butler, Rajasthan Royals, BCCI

Tags:    

Similar News