ఆన్లైన్ వెబినార్‌కు దరఖాస్తుల ఆహ్వానం
దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు యూనివర్సిటీ ఎంప్లాయ్ మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రైడెన్స్ బ్యూరో మోడల్ కేరియర్ సెంటర్, ఉస్మానియా విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో సాఫ్ట్ స్కిల్స్ పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు యూఈఐ అండ్ జీబీ డిప్యూటీ చీఫ్ రాము తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఆన్ లైన్ వెబినార్లో పాల్గొనాలనుకునే వారు […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు యూనివర్సిటీ ఎంప్లాయ్ మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రైడెన్స్ బ్యూరో మోడల్ కేరియర్ సెంటర్, ఉస్మానియా విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో సాఫ్ట్ స్కిల్స్ పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు యూఈఐ అండ్ జీబీ డిప్యూటీ చీఫ్ రాము తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఆన్ లైన్ వెబినార్లో పాల్గొనాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గరిష్ట వయో పరిమితి 35 ఉండాలని, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీ టెక్ చదివిన అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. ఇతర వివరాలకు 8247656356 (రఘుపతి రెడ్డి) నంబర్ లో సంప్రదించాలని సూచించారు.