బుక్‌లెట్‌ల కొనుగోలుకు టెండర్ల ఆహ్వానం

దిశ, హైదరాబాద్: హైదరాబాద్‌లో గతంలో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షల్లో పూర్తిగా వినియోగించని బుక్ లెట్స్, అట్ట పెట్టలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి గలవారి నుంచి సీల్డ్ టెండర్ కోరుతున్నట్లు కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. టెండర్‌దార్లు సంబంధిత పేపర్లను ఉదయం 11 నుంచి సాయంత్రం 4.౩౦ గంటలలోపు పరిశీలించుకోవచ్చని వెల్లడించారు. మార్చి 2వరకు టెండర్లను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు టెండర్‌ఫారంతో పాటు కలెక్టర్ పేరిట ఏదేని జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.2వేల డీడీని జతపర్చాలని తెలిపారు. […]

Update: 2020-02-23 09:42 GMT

దిశ, హైదరాబాద్: హైదరాబాద్‌లో గతంలో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షల్లో పూర్తిగా వినియోగించని బుక్ లెట్స్, అట్ట పెట్టలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి గలవారి నుంచి సీల్డ్ టెండర్ కోరుతున్నట్లు కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. టెండర్‌దార్లు సంబంధిత పేపర్లను ఉదయం 11 నుంచి సాయంత్రం 4.౩౦ గంటలలోపు పరిశీలించుకోవచ్చని వెల్లడించారు. మార్చి 2వరకు టెండర్లను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు టెండర్‌ఫారంతో పాటు కలెక్టర్ పేరిట ఏదేని జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.2వేల డీడీని జతపర్చాలని తెలిపారు. పూర్తి చిరునామా, మొబైల్ నెంబర్ రాయాలని సూచించారు. వచ్చే నెల 3న మధ్యాహ్నం 12 గంటలకు అడిషనల్ కలెక్టర్ ఛాంబర్‌లో సీల్డ్ టెండర్లు తెరిచి, దక్కించుకున్న వారి వివరాలు వెల్లడిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించారు.

Read also..

టీఆర్ఎస్‌లోకి నారాయణరెడ్డి

Full View

Tags:    

Similar News