రైతు ఉద్యమం.. కనెక్షన్ కట్
దిశ, వెబ్‌డెస్క్ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళనలకు మరోసారి అడ్డంకి ఏర్పడింది. చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రైతులు శనివారం ‘చక్కాజామ్’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.ఈ రోజు మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటలకు దేశవ్యాప్తంగా రహదారుల నిర్భంధానికి రైతుల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, ఘాజీపూర్ అండ్ టిక్రి బోర్డర్లలో రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను మరోసారి కేంద్ర హోంశాఖ నిలిపివేసింది. ఈ నిషేధం […]
దిశ, వెబ్‌డెస్క్ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళనలకు మరోసారి అడ్డంకి ఏర్పడింది. చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రైతులు శనివారం ‘చక్కాజామ్’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.ఈ రోజు మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటలకు దేశవ్యాప్తంగా రహదారుల నిర్భంధానికి రైతుల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, ఘాజీపూర్ అండ్ టిక్రి బోర్డర్లలో రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను మరోసారి కేంద్ర హోంశాఖ నిలిపివేసింది. ఈ నిషేధం 24గంటల వరకు ఉంటుందని కొనసాగుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలాఉండగా, రైతులు తలపెట్టిన చక్కాజామ్ ప్రోగ్రాం విజయవంతమైనట్లు రైతు సంఘాల నాయకులు తెలిపారు.