యోగి సర్కారుపై ‘అంతర్జాతీయ కుట్ర’??
లక్నో: హాథ్రస్ ఘటన నేపథ్యంలో యోగి సర్కారును అప్రతిష్టపాలు చేసే అంతర్జాతీయ కుట్రను గుర్తించినట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. దేశద్రోహం సహా కఠినమైన సెక్షన్‌ల కింద హాథ్రస్ జిల్లాలోని చాంద్‌పా పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అమెరికాలోని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనకారులు కరోనా నుంచి జాగ్రత్తలతోపాటు పోలీసుల కళ్లుగప్పి ఆందోళన చేయడానికి పాటించిన కొన్ని మెలకువలను ఇక్కడ పొందుపరిచిన ఓ వెబ్‌సైట్‌ను పోలీసులు గుర్తించినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ కేసు నమోదైనట్టు చాంద్‌పా పోలీసు […]
లక్నో: హాథ్రస్ ఘటన నేపథ్యంలో యోగి సర్కారును అప్రతిష్టపాలు చేసే అంతర్జాతీయ కుట్రను గుర్తించినట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. దేశద్రోహం సహా కఠినమైన సెక్షన్‌ల కింద హాథ్రస్ జిల్లాలోని చాంద్‌పా పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అమెరికాలోని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనకారులు కరోనా నుంచి జాగ్రత్తలతోపాటు పోలీసుల కళ్లుగప్పి ఆందోళన చేయడానికి పాటించిన కొన్ని మెలకువలను ఇక్కడ పొందుపరిచిన ఓ వెబ్‌సైట్‌ను పోలీసులు గుర్తించినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ కేసు నమోదైనట్టు చాంద్‌పా పోలీసు ఇంచార్జ్ ధ్రువీకరించారు.
కులాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను కాలరాయాలనే కుట్ర జరిగినట్టు పోలీసులు తెలిపారు. రాష్ట్రం, దేశంలో కులం, మతం ఆధారంగా అల్లర్లను రెచ్చగొట్టేవారి బండారాన్ని బయటపెట్టాలని బీజేపీ కార్యకర్తలకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సూచించిన కొన్ని రోజుల తర్వాత ఈ ఎఫ్ఐఆర్ నమోదవడం గమనార్హం.