‘ఎన్‌పీఆర్‌’తో మిత్రపక్షాల్లో చీలిక..?

సైద్ధాంతికంగా భిన్నభావాలు గల మహారాష్ట్ర ప్రభుత్వ మిత్రపక్షాలకు మరో పరీక్ష ఎదరుకాబోతోంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకిస్తున్నా.. పట్టించుకోకుండా మహారాష్ట్రలో మే 1 నుంచి జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)ను అమలు చేసేందుకు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే నిర్ణయించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. ఎన్నార్సీనే మరో రూపంలో ఎన్‌పీఆర్‌గా తీసుకొస్తున్నారని గతంలోనే కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని వెల్లడించగా..ఎన్పీపీ కూడా తన వైఖరిని వెల్లడించింది. అయితే ‘ఎన్‌పీఆర్‌కు మద్దతివ్వబోమని పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టంగా చెప్పారని […]

Update: 2020-02-15 07:26 GMT

సైద్ధాంతికంగా భిన్నభావాలు గల మహారాష్ట్ర ప్రభుత్వ మిత్రపక్షాలకు మరో పరీక్ష ఎదరుకాబోతోంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకిస్తున్నా.. పట్టించుకోకుండా మహారాష్ట్రలో మే 1 నుంచి జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)ను అమలు చేసేందుకు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే నిర్ణయించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. ఎన్నార్సీనే మరో రూపంలో ఎన్‌పీఆర్‌గా తీసుకొస్తున్నారని గతంలోనే కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని వెల్లడించగా..ఎన్పీపీ కూడా తన వైఖరిని వెల్లడించింది. అయితే ‘ఎన్‌పీఆర్‌కు మద్దతివ్వబోమని పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టంగా చెప్పారని ఎన్సీపీ నేత మజీద్ మీమన్ తెలిపారు. అయితే మూడు పార్టీలు కలిసే తుది నిర్ణయం తీసుకుంటాయని వెల్లడించారు. కాగా ప్రధాన సమస్యలపై మిత్రపక్షాల్లో విభేదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఎల్గర్ పరిషత్ కేసు దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏను ఉద్దవ్ ఠాక్రే అనుమతించడాన్ని శరద్ పవార్ తప్పుబట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి బంధం దీర్ఘకాలం కొనసాగే అవకాశం లేదని విమర్శలు ఎదురవుతున్నాయి.

Tags:    

Similar News