ఫెయిల్ అవుతానన్న భయంతో ఇంటర్ విద్యార్థి..

దిశ, మెదక్: అమ్మాయి వయస్సు 17 ఏళ్లు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతోంది. గత వారం రోజుల నుంచి ఇంటర్ ఫలితాలు త్వరలో విడుదల చేస్తామని అధికారులు వెల్లడించడంతో.. అమ్మాయికి ఫెయిల్ అవుతానన్న భయం పట్టుకుంది. అన్నం కూడా సరిగా తినడం లేదు. ఫెయిల్ అయినా ఫర్వలేదు.. టెన్షన్ పడకు అని తల్లిదండ్రులు భరోసా ఇచ్చారు. అయినా అమ్మాయికి ఫెయిల్ భయం వీడలేదు. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు […]

Update: 2020-06-18 07:38 GMT

దిశ, మెదక్: అమ్మాయి వయస్సు 17 ఏళ్లు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతోంది. గత వారం రోజుల నుంచి ఇంటర్ ఫలితాలు త్వరలో విడుదల చేస్తామని అధికారులు వెల్లడించడంతో.. అమ్మాయికి ఫెయిల్ అవుతానన్న భయం పట్టుకుంది. అన్నం కూడా సరిగా తినడం లేదు. ఫెయిల్ అయినా ఫర్వలేదు.. టెన్షన్ పడకు అని తల్లిదండ్రులు భరోసా ఇచ్చారు. అయినా అమ్మాయికి ఫెయిల్ భయం వీడలేదు. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. శిల్ప అనే అమ్మాయి చేగుంట మోడల్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో గరువారం ఉదయం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News